పాకిస్తాన్ కు ఆఫ్ఘనిస్తాన్ హెచ్చరిక

పాక్,ఆఫ్ఘన్ రెండు ఆసియా దేశాలే.అయితే రెండు దేశాలకు పొసగడం లేదు.

 Afghanisthan Strong Warning To Pakistan Details, Afghanisthan Strong Warning ,pa-TeluguStop.com

అందుకు కారణం ఉగ్రవాదం.ఉగ్రవాదం అనేది ఓ భూతం.

దేశాలను అస్థిర పరుస్తూ, ప్రజలను భయకంపితులను చేసే ఒక అక్రమమైన,భయంకరమైన విధానం.ఈ ఉగ్రవాదానికి ఎందరో సామాన్య పౌరులు బలైపోయారు.

ఈ దిశలో కొంతమందికి మరణ శిక్ష కూడా పడింది.భారత్ లో అలజడి సృష్టించిన ఉగ్రవాది కసబ్ కు భారత్ మరణ శిక్ష విధించింది.

ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఏ దేశంతోనైనా పోరాడతాం, ఉగ్రవాదాన్ని నిలువరిస్తాం,కూకటివేళ్ళతో పెకిలిస్తాం అని భారత్ ఉగ్రవాదులను తీవ్రంగా హెచ్చరించింది.భారత్ తో పాటు ఉగ్రవాద నిర్ములనకు అనేక దేశాలు స్పందించాయి.

అగ్ర దేశం అమెరికా కూడా భారత్ కు తోడ్పాటును అందించింది.ముఖ్యంగా భారత్ ,పాక్ ను గట్టిగా హెచ్చరించింది.

ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న మీరు(పాక్) వెంటనే ఆ మూలాలనుండి బైట పడాలి అని ఎన్నో మార్లు భారత్ విజ్ఞప్తి చేసింది.

ఇదిలావుండగా పుల్వామా ఉగ్రదాడి ప్రధాన సూత్రధారి,కరడు గట్టిన అంతర్జాతీయ ఉగ్రవాది జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజహర్ ఆఫ్ఘనిస్తాన్ లో తల దాచుకుంటున్నాడని పాక్ ఆరోపించింది.

దీనికి ఆఫ్ఘనిస్తాన్ గట్టిగా పాక్ ను మందలించింది.ఉగ్రవాదాన్ని పోషిస్తున్నది మీరే,ఉగ్ర సంస్థలు మీ దేశం లోనే ఉన్నాయి.మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలి అని ఆఫ్ఘనిస్తాన్ లోని తాలిబన్ సర్కార్ ప్రతినిధి పాక్ పై మండి పడ్డాడు.అయితే పాక్ దీన్ని తోసిపుచ్చింది.

అతను మీ దేశంలోనే ఆశ్రయం పొందుతున్నాడు, మీరే అతన్ని పట్టుకుని శిక విధించాలని పాక్ ఆరోపణ.ఆఫ్ఘనిస్తాన్ లోనే అతను ఉంటున్నాడనే ఖచ్చితమైన సమాచారం మాకు ఉందని పాక్ చెబుతుంటే ఆఫ్ఘనిస్తాన్ పాక్ ను గట్టిగా హెచ్చరిస్తూ అటువంటి ఉగ్ర సంస్థలు, ఉగ్రవాదుల కు స్వర్గధామం మీ దేశమే అని హెచ్చరిక చేసింది.

ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడిప్పుడే విశ్వం లోని అన్ని దేశాలతో మంచి దౌత్య సంబంధాలు పెంచుకుని,పటిష్టం చేసుకుని దేశాల మధ్య సహకారం ఆశిస్తోందని ఆఫ్ఘనిస్తాన్ పేర్కొంది.

Telugu Afghanisthan, America, China, India, Pakistan, Taliban, Talibans, Terrori

ఇక మసూద్ విషయానికి వస్తే 2019 పుల్వామా ఉగ్రదాడిలో దాదాపు నలభై మందికి పైగా సి.ఆర్.పి.ఎఫ్ జవాన్లు మరణించారని,దీనికి కారకుడు మసూదే నని తెలుస్తోంది.ఇప్పటికే పశ్చిమ దేశాలు ఉగ్రవాదాన్ని తుదముట్టించాలని పలు మార్లు పాక్ కు హెచ్చరికలు జారీ చేశారు.

భారత్ కూడా పాక్ కు ఉగ్ర సంస్థలు, ఉగ్రవాదులు మీ దేశంలోనే ఉన్నారు.మీరు నిర్ములించక పోతే అంతర్జాతీయ స్థాయిలో దోషిగా నిలబడతారు అని పేర్కొంది.ఏది ఏమైనా ఉగ్రదాడులు ఏ దేశానికి మేలు చేయవు.దాడి చేసి ఉగ్రవాదులు బావుకున్నది ఏమి లేదు.

దీని వల్ల వారు ఏ దేశం లో ఉన్నారో ఆ దేశానికి చెడ్డ పేరు,మరియు ఉగ్రదేశం అని పేర్కొంటారు.తద్వారా ఏ దేశ సహాయ సహకారాలు ఆ దేశాలకు అందవు.

ఈ విషయంలో అటు పాక్,ఇటు ఆఫ్గన్ రెండూ కూడా వాస్తవాలు వెల్లడిస్తే మంచిది.ఉగ్రవాదులకు ఆశ్రయమిచ్చి ఏమి ఫలితం సాధిస్తారో వారికే తెలియాలి.

అందుకే భారత్ ఎప్పుడు పాక్ సరిహద్దుల్లో అప్రమత్తంగా ఉంటోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube