కడప జిల్లా: ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించిన మాజీ మంత్రి డిఎల్. 2024 ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటన.
రాష్ట్ర ప్రభుత్వం తీరుపై ఘాటుగా స్పందించిన మాజీ మంత్రి డిఎల్.సమైక్యాంధ్ర ఉద్యమం తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చిన డిఎల్.
ఏ పార్టీ తరపున పోటీ చేస్తానన్నది ఇప్పుడే చెప్పలేనన్న డీఎల్.ప్రతిభ ఆధారంగానే పార్టీ టికెట్ వస్తుందంటున్న డిఎల్.
రాష్ట్రంలో మంత్రులు డమ్మీలుగా మారిపోయారన ఆరోపణలు.రెడ్ల ప్రభుత్వం రావాలని కోరుకున్న వారందరికీ తగిన బుద్ధి వచ్చింది.
రాష్ట్రంలో దురదృష్టకరమైన పరిస్థితి నెలకొంది.వ్యవసాయం సంక్షోభంలో పడిపోయింది, రైతును పట్టించుకునే నాథుడే కరువయ్యాడు.
దొంగ ఆయిల్ వ్యాపారం చేసే అంబటి కృష్ణారెడ్డి కి వ్యవసాయ శాఖలో సలహాదారుడి పదవి.తప్పు చేసిన వాడు తప్పకుండా జైలుకు పోతాడు.పొలాన్ని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసే కౌలు రైతు కరువయ్యాడు.నా సొంత పొలాన్ని కౌలుకు ఇద్దామనుకున్నా ఎవరూ ముందుకు రావడం లేదు.
సొంత ఖజానా నింపుకోవడమే ధ్యేయంగా పాలకులు పని చేస్తున్నారు.రాష్ట్రంలో ఏ శాఖ మంత్రి ఆ శాఖకు సంబంధించి ప్రెస్ మీట్ పెట్టడం లేదు.
దారినపోయే వారందరూ ప్రెస్ మీట్ లు పెడుతున్నారు.ప్రభుత్వం ఇచ్చే ఐదు వందలు, వెయ్యికి ఆశపడి ఎవరు బ్రతక వద్దు.
సొంతంగా సంపాదించుకోవడం నేర్చుకోండి.

సమాజంలో జరుగుతున్న అక్రమాలపై పాలకులను మీడియా ప్రశ్నించాలి.ప్రశ్నించుకుంటే అధోగతి పాలవుతుంది.భూములు ఆక్రమించుకోవడం ఖజానా నింపుకోవడమే పాలకులు పని.రాష్ట్ర పరిస్థితి, భావితరాల గురించి ఎవరు ఆలోచన చేయడం లేదు.పేదల బియ్యాన్ని 70 శాతం ప్రజలు తినకుండా అమ్ముకుంటున్నారు.
సబ్సిడీని డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ సిస్టం ద్వారా అందించడం ఉత్తమం.రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించడం లేదు.