చాలా మందికి ప్రకృతి అంటే చాలా ఇష్టం.అందమైన చెట్ల మధ్య ప్రకృతిని చూస్తూ కొంతసేపు మనకు ఉన్న బాధలను మర్చిపోతాము.
ఇంట్లో ప్లేస్ లేకపోయినా కుండీల్లో అయినా సరే మొక్కలు నాటి ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉంటాం.అప్పుడప్పుడు పార్కులకు వెళ్లి అక్కడ చెట్లు చూస్తూ కొద్దీ సేపు ఎంజాయ్ చేస్తాం.
కానీ అక్కడ గార్డెన్ లో ఉన్న మొక్కలు ముట్టుకున్నా, లేదా కనీసం వాసనా చుసిన కూడా ప్రాణాలు పోతాయట.
అదేంటి చెట్లు మనకు ఆక్సిజన్ ను అందించి ప్రాణాలను కాపాడుతాయి.
కానీ ప్రాణాలు తీయడం ఏంటి అని అనుకుంటున్నారా.అవును ఇది నిజమే.
అక్కడ గార్డెన్ లో ఉన్న మొక్కలు మనుషుల ప్రాణాలకు హాని కలిగించి ప్రాణాలను సైతం తీస్తాయట.ఈ గార్డెన్ ఎక్కడ ఉందొ తెలుసా.
నార్తం బర్ ల్యాండ్ లోని అల్న్విక్ గార్డెన్ లో ఇలాంటి విష మొక్కలను పెంచుతున్నారట.

ఈ పార్కులో సందర్శకులను ఒంటరిగా వెళ్లేందుకు అనుమతి ఇవ్వరు.వారితో పాటు ఖచ్చితంగా ఒక గైడ్ ఉండాలి.ఇందులోకి వెళ్లిన సందర్శకులు అక్కడ మొక్కలను చేతితో తాకకూడదు.
అలా కాదని ముట్టుకుంటే ఇంకా అంతే సంగతి.ఇంతకు ముందు కొంతమంది సందర్శకులు అలా మొక్కలను తాకడం వల్ల ఆ మొక్కల్లోని విష వాయువు వాళ్ళను స్పృహ కోల్పోయేలా చేశాయట.

అందుకే ఆ మొక్కలను ఎవ్వరిని తాకకుండా వారి వెంట గైడ్ ఫాలో అవుతూ ఉంటారట.ప్రస్తుతం ఈ గార్డెన్ లో 100 కు పైగా విషపూరిత మొక్కలు ఉన్నట్టు అధికారులు తెలుపుతున్నారు.ప్రజలు వారికీ తెలియకుండా ప్రమాదకరమైన మొక్కలు కూడా పెంచే అవకాశం ఉంది.అందుకే వారికీ అవగాహన కల్పించడం కోసం ఈ గార్డెన్ ను నిర్వహిస్తున్నామని అధికారులు చెబుతున్నారు.