బుల్లితెరపై యాంకర్ గా తన ప్రస్థానం మొదలుపెట్టి, మెల్లిమెల్లిగా సినిమా అవకాశాలు అందుకుంటూ ఎంతో అద్భుతమైన గుర్తింపు సంపాదించుకున్న వారిలో జబర్దస్త్ యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.జబర్దస్త్ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ అనంతరం సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు ద్వారా వెండితెరపై ప్రేక్షకులకు సందడి చేసింది.
ఇలా అనసూయ సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ సమంత హీరో హీరోయిన్లుగా నటించిన రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రలో నటించారు.ఈ పాత్ర ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు.
ఇలా మంచి గుర్తింపు సంపాదించుకున్న అనసూయ ఎన్నో సినిమాలలో కీలక పాత్రలో నటించడమే కాకుండా ప్రత్యేక పాటల్లో చిందులు వేస్తూ తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంది.కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నా ఈ యాంకరమ్మ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు.
ఈ క్రమంలోనే నిత్యం సోషల్ మీడియాలో తనకు సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటున్నారు.అయితే అనసూయ ఎప్పుడు పొట్టి దుస్తులు ధరించి తన అందాలను ఆరబోస్తూ ఫోటోలకు ఫోజులు ఇస్తూ ఉంటారు.
ఈ క్రమంలోనే నెటిజన్ల ట్రోలింగ్ కు గురవుతుంది.అయితే తన గురించి ఈ విధంగా కామెంట్ చేసిన వారి పట్ల అనసూయ తనదైన శైలిలో స్పందిస్తూ వారికి బాగా బుద్ధి చెబుతుంది.
ఇలా నిత్యం నెటిజన్లకు, అనసూయకు మధ్య చిన్నపాటి యుద్ధం జరుగుతుందని చెప్పాలి.ఇదిలా ఉండగా తాజాగా అనసూయ సోషల్ మీడియా వేదికగా కొన్ని ఫోటోలను షేర్ చేసింది.
క్యాజువల్ వేర్ లో ఉన్నటువంటి ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.సంక్రాంతి పండుగ సందర్భంగా తన భర్త భరద్వాజ్ ఫోటోలు తీయగా అనసూయ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.
ఈ క్రమంలోనే ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఇక ఈ ఫోటోలను బాగా పరిశీలిస్తే అనసూయ చేతిపై టాటూ ఉంది.ఈ క్రమంలోనే ఈ టాటూ పై నెటిజన్లు పెద్దఎత్తున కామెంట్లు చేస్తున్నారు.

సాధారణంగా ఈ విధంగా చేతిపై టాటూలు వేయించుకున్న వారు వారి వ్యక్తిగత జీవితంలో విడాకులు తీసుకోవడం, బ్రేకప్ చెప్పుకోవడం జరుగుతోంది.సమంత నాగచైతన్య ఇద్దరూ ఒకే టాటూలను చేతిపై వేయించుకొని చివరికి విడిపోయారు.అదేవిధంగా షణ్ముఖ్, దీప్తి సునైనా ఇద్దరూ ఒకే టాటూలను వేసుకొని వీరు కూడా వీరి లవ్ కి బ్రేకప్ చెప్పుకున్నారు.
ఈ క్రమంలోనే ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఒక నెటిజన్ అనసూయకు టాటూ తీసేయమని సలహా ఇచ్చాడు.ఈ క్రమంలోనే సదరు నెటిజెన్ స్పందిస్తూ …చేతి పై ఉన్న టాటూ తీసేయండి.
ఆ దరిద్రం మనకి వద్దు అంటూ కామెంట్ చేశారు.ప్రస్తుతం ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.