డేరింగ్ అండ్ డాషింగ్ కు కేరాఫ్ అడ్రస్ బబ్లీ బ్యూటీ సమంత అనే చెప్పుకోవాలి.చెన్నైలో పుట్టి మోడలింగ్ లో తన కెరియర్ ను ప్రారంభించిన ఈ అక్కినేని కోడలు 2007లో రవి వర్మన్ దర్శకత్వంలో మాస్కోవిన్ కావేరి సినిమాలో నటించేందుకు ఒప్పుకుంది.
కానీ అనేక కారణాల వల్ల తన తొలి తెలుగు చిత్రం ‘ఏ మాయ చేశావే’తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.గౌతమ్ మీనన్ డైరక్షన్ లో జెస్సీ పాత్రలో ఏ మాయ చేశావే తో సూపర్ హిట్ కొట్టింది.
ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 40కోట్ల భారీ కలెక్షన్లు రాబట్టడంతో పాటు ఫిల్మిం ఫేర్, సిని మా అవార్డ్, నంది స్పెషల్ అవార్డ్ లతో కోట్లాది మంది అభిమానుల్ని సొంతం చేసుకుంది.
ఏ మాయ చేశావేతో సినిమాతో టాలీవుడ్ లోకి టాలెంటెడ్ హీరోయిన్ గా అడుగుపెట్టి సూపర్ స్టార్ల సరసన యాక్ట్ చేసింది.
ఇప్పటి వరకు సుమారు 19 సినిమాలు చేసిన జెస్సీ.ఈ ఏడాది జాను పాత్రలో అదరగొట్టింది.అందంతో, అభినయంతో పాటు, టాలెండ్ కలగలిసిన ఈ ముద్దుగుమ్మ ఫిట్ నెస్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది.అందుకే ఏ మాయ చేశావో సినిమాలో ఎంత హ్యాండ్ సమ్ గా ఉందో ఇప్పుడు కూడా అదే ఫిట్ నెస్ ను కంటిన్యూ చేస్తుంది.
సినిమాల కోసం అందంతో పాటు ఆరోగ్యంగా ఉండేందుకు డైట్ మెయింటైన్ చేస్తుంటుంది.నాన్ వెజ్ ఐటమ్స్ తో పాటు మిల్క్ ఓరియెంటెడ్ ఫుడ్ ఐటమ్ ను అవాయిడ్ చేస్తుంది.
కూరగాయలు, అన్నంతో సరిపెట్టుకుంటుంది.జిమ్ము , వర్కవుట్లతో పాటు శరీరాన్ని నాజూకుగా ఉంచుకుంటుంది.
పెళ్లైనా బబ్లీ బ్యూటీ., హీరోయిన్ గా కొనసాగుతుందంటే దానికి కారణం ఆమె ఫాలో అయ్యే ఫిట్ నెస్.ఇక సమంత సినిమాల గురించి చెప్పాలంటే.జాను లో తన నటనతో ప్రశంసలందుకున్న సమంత తన తదుపరి చిత్రం లేడీ డైరెక్టర్ నందిని రెడ్డితో చేస్తున్నట్లు తెలుస్తోంది.
గతేడాది ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ఓ బేబీ సూపర్ హిట్ అయ్యింది.అందుకే శామ్ తన కొత్త సినిమా నందిని రెడ్డి డైరక్షన్ లో యాక్ట్ చేసేందుకు సిద్ధమైంది.