చైతూ గురించి ఇన్నాళ్లు గుసగుసలు... ఇప్పుడు అఫిషియల్ అయ్యింది

నాగచైతన్య ఈ ఏడాది బంగార్రాజు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ ను దక్కించుకున్న విషయం తెలిసిందే.అతి త్వరలోనే థాంక్యూ అనే సినిమా తో కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

 Naga Chaitanya And Venkat Prabhu Telugu Tamil Movie Official Announcement , Akki-TeluguStop.com

మనం వంటి సూపర్ హిట్ సినిమా ను తెరకెక్కించి సక్సెస్ఫుల్ దర్శకుడిగా పేరు దక్కించుకున్న విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం లో థాంక్యూ సినిమా రూపొందింది.సినిమా కు సంబంధించిన నిర్మాణానంతర కార్యక్రమాలు ప్రస్తుతం జరుగుతున్నాయి.అతి త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తారని నాగ చైతన్య అభిమానులు ఎదురు చూస్తున్నారు.మరోవైపు నాగ చైతన్య కొత్త సినిమా గురించి గత కొన్ని రోజులుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి.తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వం లో నాగ చైతన్య ఒక సినిమా చేయబోతున్నట్లు పుకార్లు పుట్టు కొచ్చాయి.

మొదట ఈ వార్తలను ప్రతి ఒక్కరు కూడా పుకార్లు గా భావించారు.దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వం లో నాగ చైతన్య సినిమా ఎలా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు.

Telugu Akkineni, Naga Chaitanya, Tollywood, Venkat Prabhu-Movie

కానీ ఇప్పుడు ఆ పుకార్లు నిజమయ్యాయి.వెంకట్ ప్రభు దర్శకత్వం లో నాగ చైతన్య హీరోగా సినిమా అధికారిక ప్రకటన వచ్చింది.వెంకట్ ప్రభు తమిళం లో మంచి హిట్ చిత్రాలను తెరకెక్కించిన సక్సెస్ లను దక్కించుకున్నాడు.ఇప్పుడు అదే వెంకట్‌ ప్రభు.నాగచైతన్య తో కలిసి తెలుగు మరియు తమిళంలో సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడు.ఈ సినిమా ను ప్రముఖ నిర్మాణ సంస్థ భారీ బడ్జెట్తో నిర్మించేందుకు సిద్ధంగా ఉంది.

నేడు ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడటం తో నాగ చైతన్య అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుతం ఈ సినిమా కు సంబంధించిన చివరి దశ స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని త్వరలోనే తెలుగు మరియు తమిళ భాషల్లో ఈ సినిమా ఏక కాలంలో తెరకెక్కించబోతున్న ట్లుగా యూనిట్ సభ్యులు ప్రకటించారు.

నాగ చైతన్య మరో వైపు ఒక త్రిల్లర్ వెబ్ సిరీస్ ను కూడా చేస్తున్న విషయం తెలిసిందే.ఈ ఏడాది లో నాగ చైతన్య నుండి థాంక్యూ మరియు ఈ సినిమాతో పాటు ఇంకా వెబ్ సిరీస్ కూడా రాబోతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube