1.వైఎస్ అభిమానులతో షర్మిల భేటీ

ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నేతలు వైఎస్ అభిమానులతో షర్మిల మంగళవారం సమావేశమయ్యారు.
2.జె సి సెట్ కు దరఖాస్తు గడువు పొడగింపు
సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థ సొసైటీకి చెందిన జూనియర్ కళాశాలలో ప్రవేశాలకు నిర్వహించే జేసీ సెట్ 2021 ప్రవేశపరీక్ష గడువును మార్చి 10 వరకు పొడిగించినట్లు తెలంగాణ గురుకుల సొసైటీ కార్యదర్శి ప్రవీణ్ కుమార్ తెలిపారు.
3.షర్మిల ను కలిసిన యాంకర్ శ్యామల

టాలీవుడ్ ప్రముఖ యాంకర్ శ్యామల ఈరోజు ఉదయం లోటస్ పాండ్ లో వైఎస్ షర్మిలతో భేటీ అయ్యారు.పార్టీ పేరు ప్రకటించగానే శ్యామల దంపతులు షర్మిల పార్టీలో చెరబోతున్నట్టు సమాచారం.
4.ఓటుకు నోటు కేసు
సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు తుది విచారణ ఏసీబీ ప్రత్యేక కోర్టు లో ఈనెల 8న ప్రారంభం కానుంది.
5.అనంతపురం జిల్లాలో ఎలుగుబంటి సంచారం

అనంతపురం జిల్లాలో కదంపల్లి మండలం లో ఎలుగుబంటి సంచారం కలకలం రేపుతోంది.
6.కరోనా వ్యాక్సిన్ తీసుకున్న ఏపీ గవర్నర్
ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దంపతులు మూడవ దశలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు.
7.అమరావతి దీక్షలు

ఏపీ రాజధానిగా అమరావతి నే కొనసాగించాలి కోరుతూ రైతులు మహిళలు వివిధ ప్రజా సంఘాలు చేపట్టిన నిరసన దీక్షలు 441 వ రోజుకి చేరాయి.
8.కరోనా తో బీజేపీ ఎంపీ మృతి
కరోనా వైరస్ ప్రభావం తో బిజెపి ఎంపీ నందకుమార్ సింగ్ చౌహాన్ మృతి చెందారు.మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఖండ్వా ఎంపీగా ఆయన ఉన్నారు.
9.చెన్నై లో 135 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు
తమిళనాడు రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ నగదు రవాణాను అడ్డుకునేందుకు 135 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను రంగంలోకి దించారు.
10.భారత్ లో కరోనా
గడచిన 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా 12,286 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
11.’ మారిటైం ఇండియా ‘ సదస్సులో ఏపీ సీఎం జగన్

మారిటైం ఇండియా 2021 సదస్సు ను ప్రధాని నరేంద్రమోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంగళవారం ప్రారంభించారు.ఈ సమావేశంలో వర్చువల్ ద్వారా ఏపీ సీఎం జగన్ పాల్గొన్నారు.
12.వందే భారత్ మిషన్ : 60 లక్షల మంది వెనక్కి
కేంద్రం తలపెట్టిన పొంది భారత్ మిషన్ కింద విదేశాల్లో చిక్కుకుపోయిన 60 లక్షల మందికి పైగా భారతీయులు ప్రదేశానికి చేరుకున్నారు.ఈ వివరాలను పౌరవిమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
13.చేయకు తోటల్లో ప్రియాంకగాంధీ

త్వరలో అసోంలో శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్రచారం లో జోరు పెంచింది.ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ప్రచారంలో భాగంగా విశ్వనాథ్ ప్రాంతంలోని సాధురు టి.ఎస్టేట్ కి వెళ్లి అక్కడ కూలీలతో కలిసి పనిచేశారు.
14.కరోనా పై WHO సంచలన ప్రకటన
కరోనా వైరస్ వ్యాప్తి ఈ ఏడాది చివరికల్లా ఆగిపోతుంది అనే ఆలోచన పూర్తి తొందరపాటు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.
15.కరోనా కేసుకు ఏడాది

తెలంగాణలో కరోనా తొలి కేసు వెలుగులోకి వచ్చి నేటికి ఏడాది పూర్తయింది.
16.జగన్ బాబోయ్ పై రఘురామ కృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు
ఏపీ సీఎం జగన్ బాబాయ్, తమ జిల్లా మంత్రి రంగనాథ రాజు కలిసి తనపై కుట్ర చేస్తున్నారని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఆరోపించారు.
17.ప్రశాంత్ కిషోర్ కు కేబినెట్ హోదా

రాజకీయ యువ కర్త ప్రశాంత్ కిషోర్ కు క్యాబినెట్ హోదా దక్కింది ,పంజాబ్ లో త్వరలో ఎన్నికల నేపథ్యంలో కెప్టెన్ అమరేంద్ర సింగ్ తమ ప్రభుత్వానికి రాజకీయ సలహాదారు ప్రశాంత్ కిషోర్ నియమించి క్యాబినెట్ కు సమానమైన హోదా కల్పించారు.
18.ఏపీ బంద్
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కు నిరసనగా ఈ నెల 5న ఏపీ బంద్ కు విశాఖ పరిరక్షణ కమిటీ పిలుపునిచ్చింది.
19.పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించే ఆలోచన లో కేంద్రం

పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగిపోయిన నేపథ్యంలో ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతున్న నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఆయిల్ కంపెనీలు పలు, రాష్ట్ర ప్రభుత్వాలు, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడినట్టు తెలుస్తోంది.ఈ మేరకు వాటి ధరలను తగ్గించే ఆలోచనలో కేంద్రం ఉందట.
20.ఈరోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -44,420
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర- 45,420