నెల రోజుల్లో స్ట్రెచ్ మార్క్స్ ను మాయం చేసే న్యాచురల్ క్రీమ్ ఇది.. తప్పక ట్రై చేయండి!

ప్రెగ్నెన్సీ( Pregnancy ) అనంతరం మహిళలు అత్యంత సర్వసాధారణంగా ఫేస్ చేసే సమస్యల్లో స్ట్రెచ్ మార్క్స్ ఒకటి.

చర్మం వేగంగా సాగినప్పుడు లేదా కుంచించుకు పోయినప్పుడు స్ట్రెచ్ మార్క్స్ ఏర్పడుతుంటాయి.ముఖ్యంగా పొట్ట, పిరుదులు, ఛాతీ, చేతులు, తొడలపై ఇవి ఏర్పడుతుంటాయి.

స్ట్రెచ్ మార్క్స్( Stretch Marks ) వల్ల ఆరోగ్యానికి వచ్చే నష్టం ఏమీ లేకపోయినా చర్మం మాత్రం చాలా అసహ్యంగా కనిపిస్తుంది.

అందుకే వీటిని వదిలించుకునేందుకు నానా తంటాలు పడుతుంటారు.అయితే అలాంటి వారికి ఇప్పుడు చెప్పబోయే న్యాచురల్ క్రీమ్ చాలా బాగా సహాయపడుతుంది.

ఈ క్రీమ్ ను రెగ్యులర్ గా కనుక వాడారంటే నెల రోజుల్లో స్ట్రెచ్ మార్క్స్ మాయం అవుతాయి.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ క్రీమ్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు వాసెలిన్ వేసుకోవాలి.

అలాగే పావు టేబుల్ స్పూన్ అల్లం పొడి వేసుకుని రెండు కలిసేలా బాగా మిక్స్‌ చేసుకోవాలి.

"""/"/ ఆ తర్వాత అందులో వన్ టేబుల్ స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్( Apple Cider Vinegar ) మరియు వన్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్ వేసుకుని మరోసారి మిక్స్ చేసుకోవాలి.

తద్వారా మన క్రీమ్ అనేది సిద్ధం అవుతుంది.ఈ క్రీమ్ ను స్ట్రెచ్ మార్క్స్ ఏర్పడిన చోట అప్లై చేసుకుని సున్నితంగా రెండు నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి.

ఆపై చర్మాన్ని కనీసం గంట పాటు ఆరబెట్టుకుని అనంతరం గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి.

కావాలి అనుకుంటే మీరు ఈ క్రీమ్ నైట్ అప్లై చేసుకొని ఉదయాన్నే స్నానం కూడా చేయవచ్చు.

నిత్యం ఈ క్రీమ్ ను వాడటం వల్ల మంచి ప్రయోజనాలు పొందుతారు. """/"/ వాసెలిన్, అల్లం పొడి( Ginger Powder ), యాపిల్ సైడర్ వెనిగర్ మరియు విటమిన్ ఈ ఆయిల్ స్ట్రెచ్ మార్క్స్ కు వ్యతిరేకంగా పోరాడుతాయి.

వాటిని క్రమంగా మాయం చేసి చర్మానికి మళ్లీ మునుపటి మెరుపును అందిస్తాయి.సాగిన చర్మాన్ని టైట్ గా మారుస్తాయి.

స్ట్రెచ్ మార్క్స్ తో బాధపడుతున్న వారికి ఈ క్రీమ్ చాలా ఉత్తమంగా సహాయపడుతుంది.

కాబట్టి తప్పకుండా తయారుచేసుకుని వాడేందుకు ప్రయత్నించండి.

వరంగల్‌లో విషాదం.. రీల్స్ షూట్‌ చేస్తూ పొరపాటున ఉరివేసుకుని యువకుడు మృతి..