మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు.ఇందులో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్నారు.
ముందుగా బెల్లంపల్లిలో పర్యటించనున్న మంత్రి కేటీఆర్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, అర్బన్ మిషన్ భగీరథ పనులకు శంకుస్థాపన చేయనున్నారు.తరువాత పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేయనున్నారు.
అక్కడ నుంచి మధ్యాహ్నం రామగుండం వెళ్లనున్న ఆయన రామగుండం కమిషనరేట్ ను ప్రారంభించనున్నారు.తరువాత పోలీస్ అధికారులతో ప్రత్యేక సమావేశం అవుతారు.
అనంతరం రామగుండం అభివృద్ధి కార్యక్రమాల పైలన్ ను ప్రారంభించనున్నారు.ఆ తరువాత గోదావరిఖనిలో నిర్వహించే భారీ బహిరంగ సభకు మంత్రి కేటీఆర్ హాజరుకానున్నారు.