తెలంగాణలో కాంగ్రెస్ శ్రేణులకు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు.మునుగోడును కేవలం ఉప ఎన్నికగానే చూడలేమని తెలిపారు.
కాంగ్రెస్ ను అంతం చేయాలని బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు.కాంగ్రెస్ భిక్షతో ఎదిగిన వాళ్లే వెన్నుపోటు పొడిచారని విమర్శించారు.
ఎన్నికల నిబంధనలను తుంగలో తొక్కుతున్నారని మండిపడ్డారు.యాదాద్రి దేవస్థానాన్ని రాజకీయ లబ్ధికి వేదికగా మార్చారని లేఖలో పేర్కొన్నారు.
ఆడబిడ్డ అని చూడకుండా పాల్వాయి స్రవంతిపై రాళ్ల దాడి చేశారని చెప్పారు.ఈ క్రమంలో మునుగోడులో కలిసి కదం తొక్కుదామంటూ పిలుపునిచ్చారు.
మునుగోడులో కాంగ్రెస్ జెండాను ఎగర వేయడానికి ప్రతి నేత, కార్యకర్త నడుం బిగించాలని లేఖలో కోరారు.