ఒక సాధారణ యువతి తాను సోషల్ మీడియాలో స్టార్ గా మారిన కథను పంచుకుంది.కేవలం 17 ఏళ్ల వయస్సులో తాను సోషల్ మీడియా ప్రపంచంలో ఎలా మునిగి తేలానో ఆమె వివరించింది.
బ్రిటన్‌లో నివసిస్తున్న ఈ అమ్మాయి పేరు ఇస్సీ మోలోనీ.ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.
కరోనా మధ్య లాక్డౌన్ సమయంలో మోలోనీ ఇంతటి ప్రజాదరణ పొందింది.మోలోనీ ప్రతి నెలా లక్షల్లో ఆదాయాన్ని సంపాదిస్తోంది.తన సంపాదనతో ఒక విలాసవంతమైన ఇంటిని కూడా కొనుగోలు చేసింది.‘డైలీ స్టార్‘తో మాట్లాడిన మోలోనీ తాను 9 సంవత్సరాల వయస్సు నుండి సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నానని చెప్పింది.ఆమె Musical.ly యాప్‌తో వీడియోలు ప్రారంభించింది.కానీ Musical.ly టిక్‌టాక్‌లో విలీనమైనప్పుడు పరిస్థితులు మారిపోయాయి.
టిక్‌టాక్‌కి వచ్చిన తర్వాత, లాక్‌డౌన్ సమయంలో ఆమె సృష్టించిన కంటెంట్‌తో మోలోనీ రాత్రికి రాత్రే స్టార్ అయ్యింది.తక్కువ సమయంలోనే ఆమె ఖాతా (@isseypovs) 3 మిలియన్లకుపైగా ఫాలోవర్లను సంపాదించుకుంది.
అప్పటి నుంచి మోలోనీ ఇక వెనుదిరిగి చూసుకోలేదు.ఒక్కసారిగా మీకు ఇంత పెద్ద సంఖ్యలో ఫాలోవర్లు ఎలా వచ్చారు అని ఆమెను అడిగితే.
అప్పటి అవసరాలకు తగ్గట్టుగానే కంటెంట్‌ని రూపొందించాను అని మోలోని చెప్పింది.ఆమె మొదట TikTok ఖాతాను సృష్టించి, ఆపై POVలను పోస్ట్ చేయడం ప్రారంభించింది.
POVలు అంటే కథనాన్ని సృష్టించి, దానికి పాటను జోడించడం.ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ లాంటివి.
మోలోనీ తెలిపిన వివరాల ప్రకారం, టీనేజ్ అబ్బాయిలు, అమ్మాయిలకు సంబంధించిన కంటెంట్ లేదా వీడియోలను ఆమె ఎల్లప్పుడూ పోస్ట్ చేస్తుంటుంది.మోలోనీకి ఇన్‌స్టాగ్రామ్‌లో 2 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు.
బ్రాండ్‌ను ప్రమోట్ చేయడం వల్ల ఖచ్చితంగా చాలా డబ్బు వస్తుందని, తన ఫాలోవర్లు ఇష్టపడతారని భావించే సంస్థలతో మాత్రమే పనిచేస్తానని ఆమె చెప్పింది.తన సంపాదనతో విలాసవంతమైన ఇల్లు కూడా సమకూర్చుకున్నానని ఆమె తెలిపింది.