జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్( pawan klayan) అటు సినిమాలను, ఇటు రాజకీయాలను రెండిటినీ బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు.ఇక ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ఈ మద్యనే వారాహి విజయ యాత్రను( varahi yatra ) మొదలు ఏపీ రాజకీయాలను వేడెక్కిస్తున్నారు.
వారాహి యాత్రలో భాగంగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు ఏ స్థాయిలో పోలిటికల్ హిట్ పొంచుతున్నాయో అందరికీ తెలిసిందే.ఇక వారాహి యాత్ర తొలిదశలో భాగంగా ఉభయగోదావరి జిల్లాల్లో పర్యటిస్తున్న ఆయన.ఈ రెండు జిల్లాల్లో వైసీపీకి ఒక్క సీటు కూడా దక్కనివ్వనని ఇటీవల గట్టిగానే శపథం చేశారు.

దీంతో గోదావరి జిల్లాల్లో రాజకీయ వేడి ఒక్కసారిగా పెరిగింది.పవన్ అంతా కాన్ఫిడెంట్ గా చెప్పడానికి గల కారణంపై విశ్లేషకులు వారి వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.జనసేన కు గట్టి పట్టు ఉన్న జిల్లాల్లో గోదావరి జిల్లాలు కొంత ముందు వరుసలో ఉంటాయి.
గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ సమయంలో కూడా ఈ జిల్లాలో చిరు గట్టిగానే ఓటు బ్యాంకును కొల్లగొట్టారు.ఇక గత ఎన్నికల టైమ్ లో జనసేన కేవలం రాజోలు మాత్రమే కైవసం చేసుకున్నప్పటికి ఈ రెండు జిల్లాలో ఓటు శాతాన్ని బాగానే పెంచుకుంది.
దాంతో గతంతో పోల్చితే ఈసారి జనసేనకు మద్దతు భారీగానే పెరిగింది.దీంతో ఉభయ గోదావరి జిల్లాలోని అన్నీ స్థానాలపై జనసేన గట్టిగా కన్నెసింది.ఒక్క సీటు కూడా వైసీపీకి( YCP ) వెళ్లకుండా పవన్ వ్యూహరచనకు సిద్దమయ్యారు.

ఆ దిశగా పవన్ అమలు చేస్తున్న వ్యూహాలు సత్ఫలితలు ఇస్తున్నాయనే చెప్పవచ్చు.ఉభయగోదావరి జిల్లాలకు చెందిన కొంతమంది వైసీపీ అసంతృప్త నేతలు జనసేనలో చేరేందుకు మొగ్గు చూపుతున్నాట్లు తెలుస్తోంది.తూర్పు గోదావరి జిల్లా వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు( Thota Trimurthulu ) జనసేన గూటికి చేరబోతున్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుతం జిల్లాలో జనసేనకు పెరుగుతున్న ఆధారణ కారణంగానే ఆయన జనసేన గూటికి చేరబోతున్నట్లు తెలుస్తోంది.తోట త్రిమూర్తులు దారిలోనే మరికొంత మంది నేతలు కూడా జనసేన గూటికి చేరేందుకు సిద్దమౌతున్నట్లు టాక్.
మొత్తానికి ఉభయగోదావరి జిల్లాల్లో వైసీపీకి చెక్ పెట్టేందుకు జనసేనాని వేస్తున్న ప్లాన్స్ సక్సస్ అవుతున్నాయనే చెప్పాలి.







