విటమిన్లు, మినరల్స్, ఎంజైమ్లు కూడా ఆంటి ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి.ఆంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే ఆహారాలు తినడం వలన గుండె, క్యాన్సర్ లాంటి కణాలను తొలగించడానికి సహాయపడతాయి.
మన శరీరానికి చాలా ముఖ్యమైన పోషకాలలో యాంటీ ఆక్సిడెంట్లు ఒకటి.అయితే చాలామంది వీటి గురించి తెలుసుకోకుండా ఉంటారు.
కానీ వీటి ప్రాముఖ్యత గురించి మాత్రం తెలుసుకోవడం చాలా అవసరం.ఇది రోగాల నుండి మమ్మల్ని రక్షిస్తాయి.
యాంటీ ఆక్సిడెంట్లు ( Antioxidants )అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవడం వలన క్యాన్సర్ కణాలను తొలగించుకోవచ్చు.
అయితే యాంటీ ఆక్సిడెంట్ ఏ ఆహారాల్లో పుష్కలంగా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆపిల్( Apple ) పండును తినడం వలన క్యాన్సర్, గుండె జబ్బు, ఉబ్బసం, అల్జీమర్స్ లాంటి వ్యాధులనుండి దూరంగా ఉండవచ్చు.ఈ వ్యాధుల నుండి దూరంగా ఉండడానికి ఆపిల్ బాగా సహాయపడుతుందని పలు పరిశోధనలు సూచించాయి.
ఆపిల్స్ డయాబెటిస్, వెయిట్ లాస్, ఎముకల ఆరోగ్యం, ఊపిరితిత్తుల గట్ ఆరోగ్యం మెరుగుపడుతుంది.బ్లూబెర్రీలు, బ్లాక్ బెర్రీలు, క్రాన్ బెర్రీలు, కోరిందకాయల్లో లేదా స్ట్రాబెరీస్ లాంటి బెర్రీలలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
వీటిలో ఎక్కువ మొత్తంలో ఫైబర్ కంటెంట్ కూడా ఉంటుంది.అయితే ఇది చెడు కొలెస్ట్రాల్ ( Bad cholesterol )ను తగ్గించడానికి రక్తంలో చక్కెర స్థాయిలను మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది.అయితే వాల్నట్స్ లో ఆరోగ్యకరమైన కొవ్వులు ప్రోటీన్, ఫైబర్ లాంటి ఎన్నో పోషకాలు యాక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి.ఇక గ్రీన్ టీ( Green tea ) లో కూడా ఆంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.
ఊపిరితిత్తుల, రొమ్ము, అన్నవాహిక, కడుపు, కాలేయం, ప్యాంక్రియాటిక్, ప్రోస్టేట్ క్యాన్సర్లతో సహా ఎన్నో క్యాన్సర్లకు వ్యతిరేకంగా గ్రీన్ టీ పని చేస్తుంది.
ఆంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉన్న గ్రీన్ టీ తీసుకోవడం వలన రోగ నిరోధక పనితీరు కూడా మెరుగుపడుతుంది.ఇది మెదడు ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది.ఇక గింజలలో కూడా యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
వాల్నట్స్, పిస్తాలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.అందుకే ఈ గింజలలోని యాంటీ ఆక్సిడెంట్లను మంటను తగ్గడానికి తగ్గించడానికి సహాయపడతాయి.
అలాగే ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి.