యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ( NTR )అభిమాని శ్యామ్ మరణం ఫ్యాన్స్ ను ఎంతగానో బాధ పెట్టిందనే సంగతి తెలిసిందే.శ్యామ్ ఆత్మహత్య చేసుకున్నట్టు ఒక వీడియో సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అయింది.
అభిమాని మృతి విషయంలో రెండు పార్టీల నేతల మధ్య సైతం యుద్ధం జరిగిందనే సంగతి తెలిసిందే.అయితే శ్యామ్ పేరెంట్స్( Shyam parents ), సోదరి మాత్రం శ్యామ్ ది హత్య అని చెబుతుండటం గమనార్హం.
శ్యామ్ మేడిశెట్టి ( Shyam Madeshetty )మరణం విషయంలో అనేక మలుపులు చోటు చేసుకుంటున్నాయి.శ్యామ్ మేడిశెట్టి తండ్రి శ్రీనివాసరావు ( Srinivasa Rao )మీడియాతో మాట్లాడుతూ చనిపోవడానికి ముందురోజు రాత్రి వాళ్ల అమ్మతో శ్యామ్ మాట్లాడాడని నాన్నను డబ్బులు పంపించాలని చెప్పడంతో పాటు మరుసటి రోజు తెల్లవారుజామున వస్తానని చెప్పాడని శ్రీనివాసరావు కామెంట్లు చేయడం గమనార్హం.

మేము వెళ్లే సమయానికి శ్యామ్ బాడీ ఫ్రీజర్ లో ఉందని నా కొడుకు ఫ్రెండ్ నాతో శ్యామ్ ది హత్య అని చెప్పాడని ఆయన కామెంట్లు చేశారు.డీఎస్పీ చూపించిన వీడియోలలో శ్యామ్ వెనుక నుంచి ఎవరో మాట్లాడుతున్నారని ఆ వీడియోలో శ్యామ్ కాళ్లు వంచి ఉన్నాయని ఆయన తెలిపారు.ఎన్టీఆర్ అభిమానులు మాకు అండగా ఉంటామని చెప్పారని శ్రీనివాసరావు పేర్కొన్నారు.

నా కొడుకు చనిపోయేంత పిరికివాడు కాదని ఆయన చెప్పుకొచ్చారు.శ్యామ్ కుటుంబ సభ్యులు ఎమోషనల్ అవుతున్నారు.ఏపీ ప్రభుత్వం నుంచి శ్యామ్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందుతోందని సమాచారం అందుతోంది.
శ్యామ్ ఆత్మకు శాంతి చేకూరాలని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.శ్యామ్ మృతి విషయంలో రాబోయే రోజుల్లో ఎలాంటి ట్విస్టులు చోటు చేసుకుంటాయో చూడాల్సి ఉంది.
పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపితే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి.శ్యామ్ కుటుంబానికి జూనియర్ ఎన్టీఆర్ సైతం తమ వంతు సహాయం చేయనున్నారని తెలుస్తోంది.







