ఆహారం అస్తవ్యస్తమైన జీవన శైలి కారణంగా చాలా మంది ప్రజలు జుట్టు తెల్ల బాడడం,( Gray hair ) జుట్టు రాలిపోవడం వంటి చాలా రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు.ఇప్పుడు ఈ సమస్య ను దూరం చేసుకోవడానికి చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు.
మార్కెట్లో లభించే వివిధ రకాలైన రసానాలతో కూడిన హెయిర్ డైలు ఉపయోగిస్తున్నారు.కొందరు తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవడానికి వంటింటి చిట్కాలను కూడా పాటిస్తూ ఉన్నారు.
ఒక మాటతో చెప్పాలంటే ఇప్పుడు చాలా మంది తెల్ల జుట్టు,( white hair ) జుట్టు రాలిపోయే సమస్యలను పరిష్కరించేందుకు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు.అందుకోసం వేలకు వేలు డబ్బును ఖర్చు చేస్తూ ఉన్నారు.
అయితే మీరు జుట్టు సమస్య( Hair problem )కు ఉసిరికాయ పొడిని ఉపయోగించవచ్చు.దీని వల్ల మీ గ్రే హెయిర్ ని సహజంగా నల్లగా మార్చుకోవచ్చు.ఉసిరి మీ జుట్టు సమస్యలకు ఉత్తమమైన ఇంటి నివారణల ఒకటి అని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.మీ హెయిర్ కేర్ రొటీన్ లో ఉసిరిని క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల మీరు అందమైన పొడవాటి మెరిసే జుట్టును పొందగలుగుతారు.
యాంటీ ఆక్సిడెంట్లు,విటమిన్ సి ఇతర పోషకాలు పుష్కలంగా ఉండే ఉసిరి తెల్ల జుట్టును నల్లగా మారుస్తుంది.
ముఖ్యంగా చెప్పాలంటే నాలుగైదు ఉసిరికాయలను తీసుకొని వాటిని ముందుగా ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఆ తర్వాత వాటిని మెత్తగా పేస్టులా చేసుకోవాలి.ఇప్పుడు ఈ ఉసిరికాయ పేస్టును మీ తలపై అప్లై చేసి అరగంట పాటు అలాగే ఉంచాలి.
ఆ తర్వాత మీ జుట్టును శుభ్రంగా వాష్ చేసుకోవాలి.ఇది జుట్టుకు ఎన్నో రకాలుగా మేలు చేస్తుంది.
దీన్ని అప్లై చేయడం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.అలాగే చుండ్రు సమస్య( Dandruff problem ) కూడా దూరమవుతుంది.
ముఖ్యంగా చెప్పాలంటే జుట్టు నల్లగా మార్చేందుకు ఉసిరి పొడిని( Amla powder ) కూడా ఉపయోగించవచ్చు.