ప్రతి రోజు నిద్ర సరిగ్గా లేకుంటే శరీరం రోగాల బారిన పడుతుందని నిపుణులు చెబుతున్నారు.ఆహారంతో పాటు నిద్ర కూడా ఎంతో ముఖ్యం.
మనం ప్రతిదానికి ఒక ప్లాన్ చేసుకున్నట్లు నిద్ర కూడా కావాల్సిన సమయాన్ని కేటాయించాలి.ఒక వ్యక్తి రోజుకు కనీసం 8 గంటల నిద్ర అవసరం.
అంటే ఏదో ఒక సమయంలో 8 గంటలు నిద్రించడం కాదు.రాత్రి పూట సరైన సమయంలో నిద్రించాలి.
మీరు అర్ధరాత్రి దాటిన తర్వాత నిద్ర పోయి ఉదయం 11 గంటలకు లేస్తాను అంటే అసలు కుదరదని నిపుణులు చెబుతున్నారు.ఇది చాలా చెడ్డ అలవాటు అని కూడా చెబుతున్నారు.
మీరు రాత్రి 8 గంటల నుంచి 10 గంటల మధ్య నిద్ర పోతే మీ ఆరోగ్యం బాగుంటుంది.ఒక నెలలో ఈ విధంగా అనుసరించి చూడండి మీ శరీరంలో ఎలాంటి మార్పులు ఉంటాయో మీరే గమనించవచ్చు.ఒక వ్యక్తికి తగినంత నిద్ర చాలా అవసరం అని నిపుణులు చెబుతున్నారు.ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్,కార్టిసాల్ హార్మోన్లను కంట్రోల్ లో ఉంచడంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.తొందరగా నిద్రరించినట్లయితే మీ శరీరం ఈ హార్మోన్లను సరిగ్గా నియంత్రిస్తుంది.ఈ సమయంలో విశ్రాంతి తీసుకుంటే మీ శరీరం రీఛార్జ్ చేయడంలో ఉపయోగపడడంతో పాటు రోజంతా శక్తి స్థాయినీ పెంచుతుంది.
శరీరానికి కావలసినంత విశ్రాంతి ఇచ్చినట్లయితే జ్ఞాపక శక్తి( Memory Power ) మెరుగుపడుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.
సరిగ్గా నిద్ర లేకపోతే రోజంతా ఏ పని మీద ఆసక్తి ఉండదు.అదే తొందరగా నిద్ర పోయినట్లయితే మీ శరీరం కూడా విశ్రాంతి తీసుకుంటుంది.అలాగే ఉదయం 5 గంటలకే నిద్ర లేస్తారు.
ఇంకా చెప్పాలంటే రాత్రి పదిగంటలలోపు నిద్రపోతే మీ ఆరోగ్యం ఎంతో బాగుంటుంది.లేదంటే ఉబకాయం, గుండె జబ్బులు, షుగర్ వంటి వ్యాధులు ( Diabetes )వచ్చే ప్రమాదం పెరుగుతుంది.
అయితే తొందరగా నిద్రించినట్లైతే ఈ దీర్ఘకాలిక వ్యాధులను దూరం చేసుకోవచ్చు.రాత్రికి తొందరగా నిద్రిస్తే ఉదయం తెల్లవారుజామునే మేల్కొనే అవకాశం ఉంది.
రాత్రి సమయంలో తొందరగా నిద్రపోతే హార్మోన్లు మన కంట్రోల్ లో ఉంటాయి.కళ్ళ కింద నల్లటి వలయాలు రావు.
ముఖ్యంగా చెప్పాలంటే రాత్రి నిద్రపోయేవారు 8 నుంచి 10 గంటల మధ్య నిద్రిస్తే జీర్ణ వ్యవస్థ( Digestive system ) కూడా బాగుంటుంది. యవ్వనంగా ఉండాలంటే రాత్రి 7 గంటల లోపు భోజనం చేసి తొమ్మిది గంటల్లోపు నిద్రపోవాలని నిపుణులు చెబుతున్నారు.