ఆ హీరో ఫ్యాన్స్ చేసిన అల్లర్లకు అమితాబ్ సినిమాలన్నీ బంద్..

ఇప్పట్లో సినిమా రిలీజ్ అయితే అభిమానులు థియేటర్ల ముందు ఎంత గోల చేసేవారో పాతకాలంలో కూడా అంతే అల్లరి చేసేవారు.వీరి డ్రామా సినిమాల కంటే ఎక్కువ ఆసక్తికరంగా, ఆశ్చర్యకరంగా ఉండేవి.

 Amitab Bacchan Movies Banned By Star Hero Fans, Amitab Bacchan , Star Hero Fans-TeluguStop.com

ఇలాంటి ఓ ఘటన 1982లో జరిగింది.ఆ కాలంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ నటించిన “నమక్ హలాల్” సినిమా విడుదలకు సిద్ధమైంది.

బెంగళూరులోని గాంధీ నగర్‌లోని( Gandhi Nagar, Bangalore ) ఒక ప్రధాన థియేటర్‌లో ఈ సినిమాను ప్రదర్శించాలని నిర్ణయించారు.

అయితే, ఆ థియేటర్‌లో ముందుగానే డాక్టర్ రాజ్‌కుమార్( Dr.Rajkumar ) నటించిన “హాలు జేను “ ( Haalu Jenu ) సినిమా రిలీజ్‌కు షెడ్యూల్ చేయబడింది.ఆ సినిమా రిలీజ్ అవుతుందని తెలిసి ఎగ్జిబిటర్లు హడలి పోయారు.

ఎందుకంటే రాజ్‌కుమార్ అభిమానులు థియేటర్ స్క్రీన్ ముందు హారతులు ఇవ్వడం, టపాసులు పేల్చడం, చెత్తా చెదారం వేయడం వంటి నానా రభస సృష్టించేవారు.మూవీ రిలీజ్ పట్ల వారు అప్పటికే చాలా ఉత్సాహంగా ఉన్నారు, అందువల్ల వారిని నియంత్రించడం ఎవరి తరమూ కాలేదు.

రాజ్‌కుమార్ సినిమా విడుదలైతే వీరి బాధ పడాలనే భయంతో ఎగ్జిబిటర్ హాలు జేను సినిమాకి బదులు నమక్ హలాల్ రిలీజ్ చేద్దామనుకున్నాడు.

Telugu Trade Magazine, Amitab Bacchan, Bangalore, Dr Rajkumar, Gandhi Nagar, Fan

రాజ్ కుమార్ అభిమానులు ఈ విషయం తెలిసి ఎగ్జిబిటర్ వద్దకు వెళ్లి అల్లర్లేవీ చేయమని హామీ ఇచ్చారు.అలా తమ హీరో సినిమా అనుకున్నట్లు ముందే రిలీజ్ అయ్యేలా చేసుకున్నారు.ఈ సంగతి అమితాబ్ కు తెలిసిపోయింది.

అయితే కన్నడ కంఠీరవగా పిలుచుకునే హీరో రాజ్ కుమార్ అభిమానులతో కలిసి హిట్లర్ లా కర్ణాటక థియేటర్లను పాలిస్తున్నాడని అమితాబ్ వ్యాఖ్యలు చేసినట్లు ఓ ట్రేడ్ మ్యాగజైన్( A trade magazine ) ఒక భారీ కథనం ప్రచురించింది.

Telugu Trade Magazine, Amitab Bacchan, Bangalore, Dr Rajkumar, Gandhi Nagar, Fan

ఇది చదివిన రాజ్ కుమార్ ఫ్యాన్స్‌కు కోపం కట్టలు తెంచుకుంది.కూలీ షూటింగ్ కోసం కర్ణాటకలోనే బిగ్ బి ఉన్నాడని తెలుసుకొని పెద్ద ఎత్తున షూటింగ్ స్పాట్ కి వాళ్ళు వెళ్లారు.షూటింగ్ జరగకుండా పెద్ద గొడవ చేశారు.

అంతేకాదు, నమక్ హలాల్ తో సహా అన్ని అమితాబ్ సినిమాలు కర్ణాటక రాష్ట్రంలో వేయకుండా ఆపేశారు.ఫ్యాన్స్ చేసిన అల్లర్లు కారణంగా అమితాబ్ బచ్చన్( Amitabh Bachchan ) బాగా డిస్టర్బ్ అయ్యాడు.

వెంటనే రాజ్ కుమార్‌ను కలిసి, ఒక మ్యాగజైన్ ప్రచురించిన వ్యాఖ్యల వల్ల ఈ చిచ్చు రేగిందని, అసలు ఆ వ్యాఖ్యలు తాను ఎప్పుడూ చేయలేదని వివరణ ఇచ్చుకున్నాడు.తన తప్పు లేకున్నా క్షమాపణలు చెబుతున్నానని చెప్పాడు.

దాంతో రాజ్‌ కుమార్ తన ఫ్యాన్స్ చేసిన పనికి బాగా ఫీలయ్యాడు.రాజ్ కుమార్ అమితాబ్‌ను క్షమించడమే కాకుండా, అతని ఫ్యాన్స్ నుండి ఈ రకమైన అల్లర్లు భవిష్యత్తులో జరగకుండా చూసుకుంటానని హామీ ఇచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube