పోతుగల్ గ్రామంలో గడపగడపకు కాంగ్రెస్ కార్యక్రమం

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla ) ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్ళ బాల్ రెడ్డి ఆధ్వర్యంలో పోతుగల్( Pothugal ) గ్రామంలో గడప గడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంను సోమవారం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ తోనే సమన్యాయం దక్కుతుందని అన్నారు.

 Congress Program For Gadapagadapa In Potugal Village-TeluguStop.com

ఈ బిఆర్ఎస్ 9 యేండ్ల పాలనలో దగా మోసాలు తప్ప చేసిందేమీ లేదన్నారు.అలాగే పుట్టబోయే పాపకు 1,50, 000అప్పు చేసి పెట్టాడనీ దళిత సీఎం లేడు, దళితులకు మూడెకరాల భూమి లేదు,దళిత బంధు కేవలం బిఆర్ఎస్ కార్యకర్తలకు అందుతుంది అన్నారు.

రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన వెంటనే రైతులకు రెండు లక్షల వరకు రుణమాఫీ చేసి తీరుతామన్నారు.అలాగే పండించిన ప్రతి పంటకి గిట్టుబాటు ధర కల్పిస్తు వడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తామనీ,కౌలు రైతులకు 15000 వ్యవసాయ కూలీలకు 12000 రూపాయలు ఏటా ఇస్తామనీ తెలిపారు.

ప్రతి మహిళకు 2500 రూపాయలు, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, ఉచిత బస్సు ప్రయాణం అందిస్తామని అన్నారు.అలాగే గృహ జ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు కూడా ఇస్తామన్నారు.

ఇందిరమ్మ ఇల్లు పథకం ద్వారా ఇల్లు లేని వారికి ఇంటి స్థలము, ఐదు లక్షల రూపాయల సహాయం చేస్తామనీ,ఉద్యమకారులకు 250 గజాల జాగా ఇస్తాము అన్నారు.నిరుద్యోగులకు ప్రత్యేక జాబ్ కాలెండర్ నిర్వహించి ఉద్యోగాలు కల్పిస్తామన్నారు.

యువ వికాసం పథకం కింద ఐదు లక్షల వరకు విద్యా భరోసా కార్డు అలాగే ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తామని, మెగా డీఎస్సీ కూడా నిర్వహిస్తామన్నారు.చేయూత పథకం ద్వారా వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు 4000 రూపాయల పింఛన్ అందిస్తామన్నారు.

అలాగే రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా( Rajiv Aarogyasri ) కింద పది లక్షల రూపాయలు అందజేస్తామన్నారు.మన పక్క రాష్ట్రం అయిన కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే ఒక్కొక్క హామీని నెరవేరుస్తూ ఉన్నామనీ అలాగే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేయగానే ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా నెరవేరుస్తామని అన్నారు.

కాంగ్రెస్ పార్టీ చెబితే చేస్తుంది దానికి నిదర్శనమే మన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గుండెల్లి శ్రీనివాస్ గౌడ్,ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు తలారి నర్సింలు, సీనియర్ నాయకులు వెలిముల రామ్ రెడ్డి, మామిండ్ల ఆంజనేయులు, పోతుగల్ గ్రామ శాఖ అధ్యక్షులు ఆనమెని రాజు,ఉపాధ్యక్షులు కేసుగని బాబు,గ్రామ యువత అధ్యక్షులు కేసుగాని చంద్రమౌళి, కేసుగాని రాజయ్య, ఈర్ల లింగము, నారాయణ,కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube