ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణకు రానున్నారు.ఈ మేరకు జూలై 8వ తేదీన ఆయన రాష్ట్రానికి వస్తున్నారని సమాచారం.
తెలంగాణ పర్యటనలో భాగంగా మోదీ పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు.ముందుగా కాజీపేటలోని వ్యాగన్ ఓరలింగ్ సెంటర్ కు మోదీ శంకుస్థాపన చేయనున్నారు.
తరువాత వరంగల్ లో మెగా టెక్స్ టైల్ పార్కుకు శంకుస్థాపన చేస్తారు.అనంతరం హన్మకొండ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ లో నిర్వహించనున్న బహిరంగ సభకు మోదీ హాజరుకానున్నారు.







