ఆ విషయం లో ఘోరంగా విఫలమైన మెగా ఫ్యామిలి

హాలివుడ్, బాలివుడ్ లో సీక్వెల్స్ అంటే హిట్ మెటీరియల్స్.సీక్వేల్ కి ఉండే క్రేజ్ ని ఎలా వాడుకోవాలో ఈ రెండు ఇండస్ట్రీలకి చాలాబాగా తెలుసు.

 Mega Family Continues Sequel Flop Show-TeluguStop.com

బాలివుడ్ ని ఉదాహరణగా చెప్పుకోవాలంటే, క్రిష్ సిరీస్, ధూమ్ సిరీస్ .ఇలా చాలా ఉన్నాయి.ముందటి భాగాలకి తగ్గకుండా సీక్వేల్స్ తీస్తూ, క్రేజ్ ని సరిగ్గా వాడుకుంటున్నారు.

తెలుగులో ఇందుకు పూర్తి భిన్నంగా జరుగుతోంది.ఒక్కటంటే ఒక్కటి .ఒక్క సీక్వెల్ కూడా హిట్ కాలేదు ఇంతవరకు.మరీ ముఖ్యంగా ఈ సిక్వెల్స్ దెబ్బ మెగాఫ్యామిలికి తెలిసినంతగా ఎవరికి తెలీదేమో!…

మెగాస్టార్ చిరంజీవి శంకర్ దాదా ఎమ్బిబీఎస్ భారి హిట్ గా నిలిస్తే, శంకర్ దాదా జిందాబాద్ పెద్ద ఫ్లాప్ గా నిలిచింది.అల్లు అర్జున్ ఆర్య ఒక ట్రెండ్ సెట్టింగ్ హిట్.

ఆ తరువాత వచ్చిన ఆర్య-2 నష్టాల్ని చవిచూసింది.ఇప్పుడు తాజాగా ఈ సెంటిమెంటుకి పవన్ బలైపోయాడు.

గబ్బర్ సింగ్ పవన్ ఇమేజ్ ని ఎక్కడికో తీసుకెళ్ళిన బ్లాక్బస్టర్.దశాబ్దకాలంగా ఉన్న రికార్డుల లోటుని ఒక్క సినిమాతో తీర్చేశాడు పవన్.

పవర్ స్టార్ అయినా ఈ సీక్వెల్స్ సెంటిమెంటు బ్రేక్ చేసి సర్దార్ గబ్బర్ సింగ్ తో హిట్ కొడతాడేమో అని ఆశపడ్డారు మెగాఫ్యాన్స్.కాని ఈసారి కూడా నిరాశే మిగిలింది.

సర్దార్ బాక్సాఫీస్ దగ్గర కోలుకునే సూచనలు ఏమాత్రం కనిపించట్లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube