భారత్, పాకిస్థాన్ కు సరిహద్దు వివాదం రోజురోజుకు ఎక్కువ అవుతున్నాయి.భారత్-పాక్ మధ్య మొత్తం 778 కిలో మీటర్ల సరిహద్దు ఉంది.
ఈ సరిహద్దుల్లో పాకిస్థాన్ రోజూ కాల్పలకు పాల్పడుతోంది.ఈ ఏడాదిలో రికార్డు స్థాయిలో కాల్పులు జరిపినట్లు భారత ఆర్మీ వెల్లడించింది.
పార్లమెంట్ సమావేశాల్లో హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ భారత సరిహద్దుల్లో పాకిస్థాన్ కాల్పుల విరమణను ఉల్లంఘించిందన్నారు.పాకిస్థాన్ ప్రతిరోజు ఎక్కడో ఒక చోట కాల్పులు జరుపుతుందన్నారు.భారత ఆర్మీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.2017వ సంవత్సరంలో పాకిస్థాన్ 971 సార్లు కాల్పలకు దిగింది.2018లో 1629 సార్లు, ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ వరకు 3,186 సార్లు కాల్పులకు పాల్పడిందని ఆయన వెల్లడించారు.2019వ సంవత్సరంలో ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఈ ఘటనలు మరింత ఎక్కవయ్యాయని, పాక్ మరింత రెచ్చిపోతుందన్నారు.త్వరలో భారత ఆర్మీ పాకిస్థాన్ కు సరైన గుణపాఠం నేర్పుతుందన్నారు.అయితే దేశాల సరిహద్దు వివాదాలపై చర్చించాలని అఖిలపక్ష నాయకులు నోటీసులు ఇవ్వడంతో చర్చ జరిగింది.చైనా సరిహద్దు వివాదంపై కూడా కేంద్ర హోంశాఖ మంత్రి వ్యాఖ్యానించనున్నారు.దేశ రక్షణను కాపాడే దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని, చైనా, పాక్ దేశాలకు భారత ఆర్మీ ధీటుగా జవాబు ఇచ్చేందుకు రెడీగా ఉందన్నారు.







