నందమూరి నటసింహం బాలకృష్ణ ( Balakrishna ) ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరో వైపు అన్ స్టాపబుల్ ( Un Stoppable ) కార్యక్రమంలో ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్న విషయం మనకు తెలిసిందే.ఇప్పటికే ఆహాలో ఈ కార్యక్రమం రెండు సీజన్లను పూర్తి చేసుకుని మూడో సీజన్ కూడా ప్రసారానికి సిద్ధమవుతుంది.
ఈ క్రమంలోనే మొదటి ఎపిసోడ్ అక్టోబర్ 17వ తేదీ ప్రసారం కాబోతుందని తాజాగా విడుదల చేసిన ప్రోమో ద్వారా తెలుస్తుంది.ఇక ఈ కార్యక్రమంలోని మొదటి ఎపిసోడ్ లో భాగంగా బాలకృష్ణ హీరోగా నటించిన భగవంత్ కేసరి ( Bhagavanth kesari ) టీం నుంచి డైరెక్టర్ అనిల్ రావిపూడి( Anil Ravupudi ) నటి శ్రీ లీల ( Sreeleela ) కాజల్ అగర్వాల్ ( Kajal Aggarwal ) హాజరైనట్లు తెలుస్తోంది.

ఇక ఈ ప్రోమో ప్రారంభంలోనే బాలకృష్ణ చెప్పినటువంటి డైలాగ్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.ప్రోమో స్టార్టింగ్ లోనే బాలయ్య మాట్లాడుతూ మేము తప్పు చేయలేదని మీకు తెలుసు, మేము తల వంచము అని మీకు తెలుసు, మమ్మల్ని ఆపడానికి ఎవరు రాలేడని మీకు తెలుసని చెప్పే డైలాగ్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారడంతో బాలయ్య ఈ డైలాగ్స్ జగన్మోహన్ రెడ్డి( Jagan Mohan Reddy ) ని దృష్టిలో పెట్టుకొని చెప్పారని తెలుస్తుంది.

ప్రస్తుతం చంద్రబాబు నాయుడు( Chandrababu Naidu ) అరెస్టయి జైలులో ఉండడంతో బాలకృష్ణ ఏపీ రాజకీయాలలో చాలా యాక్టివ్ అయ్యారు.ఈ క్రమంలోనే ఈ ప్రోమో ద్వారా చెప్పిన డైలాగ్స్ అన్నీ కూడా ఏపీ పాలిటిక్స్ ను దృష్టిలో పెట్టుకుని చెప్పారని స్పష్టంగా అర్థమవుతుంది.అలాగే ఈ ప్రోమో మధ్యలో కూడా జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి బాలయ్య కొన్ని డైలాగ్స్ చెప్పారు.దీంతో ఈ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో ( Social media )వైరల్ గా మారడమే కాకుండా పూర్తి ఎపిసోడ్ పై కూడా భారీ స్థాయిలో అంచనాలను పెంచేస్తుంది.
మరి ఈ ప్రోమోకి సంబంధించి పూర్తి ఎపిసోడ్ చూడాలి అంటే 17వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.
.






