అక్కినేని నాగార్జున సినీ కెరీర్ లోని బ్లాక్ బస్టర్ హిట్లలో అన్నమయ్య( Annamayya ) సినిమా కూడా ఒకటనే సంగతి తెలిసిందే.భక్తి సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా ఎంతగానో నచ్చింది.
రాఘవేంద్ర రావు డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కగా దొరైస్వామి నాయుడు ఈ సినిమాను నిర్మించారు.జె.కె.భారవి ఈ సినిమాకు రచయితగా వ్యవహరించారు.ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లకముందు ఈ తరహా సినిమాలో నాగ్ ను ఎంపిక చేయడం కరెక్ట్ కాదని కామెంట్లు వినిపించాయి.
ఈ సినిమాలో నటించే సమయానికి నాగార్జునకు మాస్, క్లాస్ ప్రేక్షకుల్లో ఊహించని రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
భక్తిరస చిత్రంలో నటించి మెప్పించలేకపోతే నాగార్జునపై విమర్శలు వ్యక్తమయ్యే అవకాశం ఉందని కూడా కొంతమంది అన్నారు.అయితే నాగ్ మాత్రం రాఘవేంద్రరావు( Raghavendra Rao )పై ఉన్న నమ్మకంతో ఈ సినిమాలో నటించడానికి అంగీకరించారు.
అన్నమయ్య పాత్రలో నటిస్తున్నట్టు నాగార్జున ఏఎన్నార్ కు చెప్పగా ఏఎన్నార్ నాగార్జునను ప్రశంసించారు.
నువ్వు ఎన్ని సినిమాలు చేసినా కేవలం హీరో అనిపించుకుంటావని ఇలాంటి సినిమా చేస్తే మాత్రమే నటుడు అనిపించుకుంటావని ఏఎన్నార్ చెప్పడంతో నాగ్ మరింత ఉత్సాహంగా ఈ సినిమాలో నటించారు.ఆ తర్వాత వేంకటేశ్వర స్వామి రోల్ కోసం సుమన్(suman ) ను సంప్రదించగా మొదట ఆయన ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకోలేదు.రాఘవేంద్రరావు పట్టుబట్టడంతో ఆ పాత్రలో నటించడానికి సుమన్ అంగీకరించారు.
1997 సంవత్సరం మే నెల 22వ తేదీన థియేటర్లలో రిలీజైన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సంచలనాలను సృష్టించింది.నాగార్జునకు నటుడిగా ఈ సినిమా ఎంతో మంచి పేరును తెచ్చిపెట్టింది.ఈ సినిమాలో నాగ్ లుక్ సైతం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.నాగ్ ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్ లతో కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు.