వైరల్: పురోహిత క్రికెట్ లీగ్ విన్నారా ఎప్పుడైనా..?! లేదా.. అయితే ఇది మీకోసమే..!

వేద పఠనం మాత్రమే కాదు క్రీడామైదానంలో కి దిగి ఫోర్లు, సిక్సర్లు కొట్టగల సత్తా తమకు కూడా ఉందని పురోహితులు నిరూపిస్తున్నారు.ఆంధ్రప్రదేశ్ లో పురోహితులకు ప్రత్యేకించి ఒక లీగ్ జరుగుతోంది.

 Viral: Have You Ever Heard Of Purohit Cricket League ..?! Or .. But This Is For-TeluguStop.com

ఈ పురోహితల లీగ్ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని ఎస్.ఆర్.కె ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్ లో జరుగుతోంది.ఈ లీగ్ లో మొత్తం 19 జట్లు తలపడగా నేడే ఫైనల్ మ్యాచ్ జరగబోతోంది.

అయితే అయ్యగార్ల క్రికెట్ లీగ్ ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది.అయితే ఈ ఏడాది పురోహితల లీగ్ కి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి విశాఖ కమాండ్ రాజమండ్రి రాజోలు తదితర జిల్లాలకు చెందిన పురోహితులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

అయితే నేడు జరిగే ఫైనల్ మ్యాచ్ లో గెలిచిన పురోహితుల జట్టుకు 60 వేల రూపాయల నగదును ప్రకటించారు.తెలుగు రాష్ట్రాల నుంచి పలు జిల్లాల పురోహితులు ఈ లీగ్ లో పాల్గొనగా అన్నవరం, ధర్మగిరి, కాకినాడ, రాజమండ్రి జట్లు సెమీ ఫైనల్ కు చేరుకున్నాయి.

ఆ తర్వాత జరిగిన మ్యాచులలో ధర్మగిరి కాకినాడ ఫైనల్ మ్యాచ్ కి చేరుకున్నాయని సమాచారం.అయితే నేడు జరగనున్న ఫైనల్ మ్యాచ్ కి హైకోర్టు న్యాయమూర్తి బి.

కృష్ణమోహన్ చీఫ్ గెస్ట్ గా విచ్చేయనున్నారని.ఆయన చేతుల మీదగా నగదు బహుమతి అందించనున్నారని తెలుస్తోంది.

అయితే ఈ రోజు జరగనున్న ఫైనల్ మ్యాచ్ లో పురోహిత క్రీడాకారులు పంచ కట్టు కట్టుకుని ఫోర్లు సిక్సర్లతో దుమ్ము రేపడానికి రెడీ అయిపోతున్నారు.బ్రహ్మ జోస్యుల సుబ్రహ్మణ్యం, బ్రహ్మ జోస్యుల ప్రసాద్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ రాష్ట్రస్థాయి పురోహిత క్రికెట్ లీగ్ ని భీమవరం కింగ్స్ జట్టు నిర్వహిస్తోంది.

ఏది ఏమైనా నిత్యం వేద మంత్రాలు చదువుతూ పూజలు పునస్కారాలు చేసే పురోహితులు బ్యాట్ పట్టి వీరేంద్ర సెహ్వాగ్, క్రిస్ గేల్ లాగా ఫోర్లు సిక్సర్లు బాదుతుండటం తో సామాన్య ప్రజలు అవాక్కవుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube