రాజకీయాలు వద్దని జగన్ కు చెప్పానన్న పోసాని.. షర్మిల కాళ్లకు దండం పెడతానంటూ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో పోసాని కృష్ణమురళికి( Posani Krishnamurali ) ఏ స్థాయిలో గుర్తింపు ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఈ మధ్య కాలంలో సినిమాలలో ఎక్కువగా కనిపించని పోసాని కృష్ణమురళి వైసీపీ తరపున పొలిటికల్ కార్యక్రమాల్లో బిజీ అయిన సంగతి తెలిసిందే.

 Posani Comments About Politics Details Here Goes Viral In Social Media , Posani-TeluguStop.com

అయితే ఒక ప్రముఖ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన పోసాని ఆ ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాలను చెప్పుకొచ్చారు.

జగన్ గారు ఏ పదవి కావాలని ఇద్దరు వ్యక్తులను పంపించారని ఆ సమయంలో నాకు ఎలాంటి పదవి వద్దని ఎప్పుడైనా అవసరం అనుకుంటే సర్వీస్ చేస్తామని మాత్రమే చెప్పానని పోసాని కామెంట్లు చేశారు.

కావాలంటే సాక్షి నాగేశ్వరరావును( Sakshi Nageswara Rao ) కూడా ఈ విషయాలు అడిగి తెలుసుకోవాలని పోసాని కృష్ణమురళి పేర్కొన్నారు.ప్రశాంత్ కిషోర్( Prashanth Kishore ) కూడా నన్ను పిలిపించాలని అప్పుడు అడిగారని ఆయన చెప్పుకొచ్చారు.

Telugu Posani, Sakshinageswara, Sharmila-Politics

నన్ను ఎందుకు జగన్ పిలిచారో తెలియదని ఆయన పేర్కొన్నారు.ఇదే సమయంలో పోసాని కృష్ణమురళి షర్మిల ( Sharmila )గురించి సైతం కామెంట్లు చేశారు.సునీత, షర్మిళలను జగన్ తిట్టించారని చెబితే ఆ కామెంట్ల గురించి పోసాని స్పందిస్తూ ఆ వార్తలు నిజమని ప్రూవ్ చేస్తే నేను షర్మిళ కాళ్లకు దండం పెడతానని పేర్కొన్నారు.పవన్ తో జగన్ ను పోలుస్తున్నారంటే మీరు ఎలా జర్నలిస్ట్ అయ్యారని ఆయన తెలిపారు.

Telugu Posani, Sakshinageswara, Sharmila-Politics

మెదడుతో ఆలోచిస్తే జగన్ తిట్టించారో లేదో తెలుస్తుందని ఆయన అన్నారు.తెలంగాణలో షర్మిల ప్రచారం చేసి చివరకు ఏం చేశారో అందరికీ తెలుసని పోసాని తెలిపారు.రేవంత్ ను కూడా షర్మిల దొంగ అని తిట్టిందని పోసాని వెల్లడించారు.పోసాని కృష్ణమురళి చెప్పిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.పోసాని కృష్ణమురళి కామెంట్ల గురించి అవతలి వైపు నుంచి ఏమైనా కౌంటర్ వస్తుందేమో చూడాలి.పోసాని సినిమాల్లో, పాలిటిక్స్ లో బిజీ కావాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube