యూట్యూబ్ రికమెండేషన్ ఫీచర్ తొలినాళ్లలో వీడియో ప్రజాదరణ ఆధారంగా ర్యాంక్ ఇచ్చేది.మొదట్లో ఈ ఫీచర్ యూజర్స్ తమకు నచ్చిన వీడియోను చూసేందుకు సహాయపడాలనే ఏకైక ఉద్దేశ్యంతో రూపొందించారు.
ప్రస్తుతం మనం ఈ ఫీచర్‌ని రెండు చోట్ల చూడొచ్చు.ఒకటి.
హోమ్‌పేజీలో మనం యూట్యూబ్‌ని తెరిచిన వెంటనే… రెండవది మనం వీడియో చూస్తున్నప్పుడు దాని కింద వస్తుంది.మనం యూట్యూబ్‌ని తెరిచినప్పుడు, ఈహోమ్‌పేజీలో అనేక రకాల మిశ్రమ కంటెంట్ లేదా వీడియోలను చూడాలని యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది.
ఈ రికమెండ్ మనం గతంలో చూసిన వీడియోలు, సభ్యత్వాలు,కొన్ని కొత్త వీడియోల ఆధారంగా ఉంటాయి.మనం వీడియోను చూస్తున్నప్పుడు రికమెంటేషన్ మన ప్రస్తుత వీడియోపై ఆధారపడి ఉంటుంది.
యూ ట్యూబ్ అల్గారిథమ్ సిఫార్సు కోసం ఫేస్‌బుక్, ట్విట్టర్ మొదలైన ఏ ఇతర సామాజిక నెట్‌వర్క్ నుండి డేటాను ఉపయోగించదు.దానికి బదులుగా యూజర్ తన ఎంపిక ప్రకారం సాధారణంగా చూడాలనుకుంటున్న వాటి ఆధారంగా యూట్యూబ్ అతను తదుపరి ఏమి చూడాలనుకుంటున్నాడో అంచనా వేస్తుంది.
వినియోగదారుకు వీడియోను సిఫార్సు చేయడానికి యూట్యూబ్ దాని వివిధ కార్యకలాపాల నుండి సూచనలను తీసుకుంటుంది.ఉదాహరణకు వీడియోపై క్లిక్‌లు, వీడియో వీక్షణ సమయం, భాగస్వామ్యం మొదలైనవి.
యూజర్‌కు చెందిన ఈ యాక్టివిటీలను ట్రాక్ చేయడం ద్వారా యూజర్ ఎలాంటి వీడియోను ఎక్కువగా చూడాలనుకుంటున్నారో యూ ట్యూబ్ కనుగొంటుంది.వీటన్నింటితో పాటు, యూట్యూబ్ ‘వాల్యూ వాచ్‌టైమ్‘ పేరుతో తన వినియోగదారుల నుండి రికమెండ్ చేసిన వీడియోలపై సర్వే కూడా నిర్వహిస్తుంది.
సర్వేలో యూజర్ సిఫార్సు చేసిన వీడియోకి ఒకటి నుండి ఐదు వరకు రేటింగ్ ఇవ్వాలని కోరుతుంది.ఈ విధంగా యూట్యూబ్ వినియోగదారు ఏవి ఎంతగా ఇష్టపడుతున్నాడో కనుగొంటుంది.
యూట్యూబ్ రికమెండేషన్ ఫీచర్‌ని సులభంగా స్విచ్ ఆఫ్ చేయవచ్చు.దీన్ని స్విచ్ ఆఫ్ చేయడానికి, యూజర్ తన హిస్టరీ తొలగించాలి.
దీంతో యూట్యూబ్ వ్యక్తిగతీకరించిన రికమెండేషన్లను నిలిపివేస్తుంది.ఇంతేకాకుండా యూజర్ నిర్దిష్ట వీడియోను తొలగిస్తే, ఆ వీడియోకు సంబంధించిన రికమెండేషన్ ఆగిపోతుంది.