తెలంగాలణలో రాహుల్ గాంధీ పర్యటించన్నున్నారు.రెండు రోజుల పాట్టు ఆయన పర్యటించున్నట్లు కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు.
ఈనేపథ్యంలో వరంగల్ కాంగ్రెస్ నేతలు భారీ సభ నిర్వహించారు.అయితే ఈ సభకు కొంతమంది కాంగ్రెస్ కీలక నేతలు దూరం కానున్నారు.
పార్టీ వర్గపోరు రాజకీయాల వల్లే పార్టీపై నేతలు అసంతృప్తితో ఉన్నారు.గత కొతకాలంగా తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో వర్గపోరు కొనసాగుతున విషయం తెలిసిందే అయితే రాహుల సభకు కాంగ్రెస్ సినియర్ల నేతలు దూరం కానున్నట్లు ఆ పార్టీ శేణులు చెబుతున్నారు.
వరంగల్ రాహుల్ సభకు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి వెళ్తకూడదని నిర్ణయం తీసుకున్టన్లు తెలుస్తోంది.అయితే పార్టీపై అసంతృప్తితో కొంతకాలంగా కాంగ్రెస్ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి.
సభ ఏర్పాట్లలోనూ ఎక్కడా కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి కనిపించలేదు.దీంతో కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి వ్యవహారంపై జిల్లా కాంగ్రెస్లో చర్చ జరుగుతోంది.
అయితే ప్రస్తుతం హైదరాబాద్లోనే ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అనారోగ్యం కారణాలతోనే సభకు వెళ్లడంలేదని తెలుస్తోంది.
తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటనను రాష్ట్ర కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
వరంగల్, హైదరాబాద్‌లో రాహుల్‌తో సభలు నిర్వహించాలని ప్లాన్ చేసింది.రైతుల ఆత్మహత్యలు, నిరుద్యోగుల సమస్యలే ఏజెండాగా టీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేయాలని భావించింది.మే6న వరంగల్‌లో రైతు సంఘర్షణ సభ నిర్వహించి, రేపు హైదరాబాద్‌లో ఓయూ విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించాలని ప్లాన్ చేశారు.అలా ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేయాలని కాంగ్రెస్ నేతలు భావించారు.

అయితే కాంగ్రెస్ నేతలకు ఓయూ వీసీ ఝలక్ ఇచ్చారు.ఓయూలో రాహుల్ గాంధీ పర్యటించేందుకు అనుమతి నిరాకరించారు.దీంతో రాజకీయ దుమారం చెలరేగింది.రంగంలోకి ఎన్ఎస్యూఐ విద్యార్థులు దిగారు.ఓయూలో ఆందోళనకు దిగారు.వీసీ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు.
వీరికి టీఆర్ఎస్వీ విద్యార్థులు కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు.రాహుల్ గో బ్యాక్ అంటూ నిరసనలు వ్యక్తం చేశారు.
దీంతో కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతల మధ్య మాటల తూటాలు పేలాయి.

ఇక రాహుల్ గాంధీ ప్రసంగం తర్వాత రోడ్డు మార్గాన హైదరాబాద్ చేరుకుంటారు.ఆ రాత్రి హోటల్ కోహినూర్‌లో బస చేసి రేపు గాంధీ భవన్లో డిజిటల్ మెంబర్ పిష్ ఫొటో సెషన్స్‌కు హాజరవుతారు.అనంతరం అమరవీరుల కుటుంబాలతో కలిసి సహపంక్తి భోజనం చేస్తారు.
ఆ తర్వాత శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుని ఢిల్లీకి బయల్దేరి వెళ్తారు.దీంతో తెలంగాణలో రాహుల్ గాంధీ రెండు రోజుల పర్యటన ముగుస్తుంది.







