స్విగ్గీలో బేసిగ్గా ఫుడ్ ని అంటే. బిర్యానీ, హండి, రైస్, రకరకాల కూరలు మొదలైన ఆహార పదార్ధాలను ఆర్డర్ చేసుకుంటాం.
ఐతే అతగాడు ఓ ప్రబుద్ధుడు కాఫీని ఆర్డర్ చేసాడు.తరువాత జరిగిన తంతు తెలిస్తే నవ్వి పోతారు.అవును… బెంగళూరుకు చెందిన ఓంకార్ జ్యోషీ తనకు కాఫీ కావాలని స్విగ్గీ డెలివరీ యాప్ లో ఆర్డర్ చేసాడు.ఆ కాఫీ సో కాల్డ్ డెలివరీ బాయ్ CCD కాఫీ కేఫ్ నుంచి తేవాల్సి వుంది.
ఆర్డర్ చేసిన కాసేపటికే, ఆర్టర్ తీసుకున్నామనీ, ప్యాకింగ్ కూడా చేస్తున్నామని ఓంకార్ ఫోనుకి మెసేజ్ వచ్చింది.ఆ వెంటనే స్విగ్గీ డెలివరీ బాయ్ CCD కాఫీ కేఫ్ నుంచి డెలివరీని తీసుకున్నాడని మరో మెసేజ్ వచ్చింది.
అయితే, ఆ మెసేజ్ చూసిన ఓంకార్ కి ఓ ఆలోచన తట్టింది… కాఫీ వేడిగా ఉంటుందా, చల్లారిపోతుందా? వేడిగా ఎలా తేవగలడు? అన్న ప్రశ్నలు అతని మదిలో మెదిలాయి.అక్కడినుండి కథ రసవత్తరంగా మారింది.
ఆ డెలివరీ బాయ్ Dunzo అనే యాప్‌కి సంబంధించిన డెలివరీ బాయ్‌కి సదరు ఆర్డర్ ని అప్పగించాడు.ఇక ఇదే విషయాన్ని మన ఓంకార్ కి కాల్ చేసి, “భయ్యా! నేను మీకు Dunzo బుక్ చేశాను.
దయచేసి నాకు 5 స్టార్ రేటింగ్ ఇవ్వండి!” అన్నాడట.దాంతో ఓంకార్ జ్యోషీకి దిమ్మతిరిగిపోయింది.

అసలే కాఫీ వేడిగా ఉంటుందో లేదో అన్న సమస్యతో బాధపడుతున్న ఓంకార్ కి సరియైన షాక్ ఇచ్చాడు డెలివరీ బాయ్.ఇక ఇదే విషయాన్ని ఓంకార్ తన ట్వీట్ ద్వారా తెలిపారు.ఈ మొత్తం తంతుని తెలుసుకున్న నెటిజన్లు ఓ రేంజులో వేసుకుంటున్నారు.విషయం తెలుసుకున్న నెటిజన్లు… ఆ డెలివరీ బాయ్ తెలివితేటల్ని మెచ్చుకుంటున్నారు.మరి వారి కామెంట్లను ఓంకార్ చదివితే మాత్రం, ఇక జన్మలో కాఫీ, టీలు వంటివి ఆన్లైన్లో ఆర్డర్ చెయ్యడు.నెటిజన్ల కామెంట్లు చూస్తే ఇలా వున్నాయి.
యదా కస్టమర్, తధా డెలివరీ బాయ్ అని ఒకరు, బద్ధకిష్టి అవార్డు ఉంటే ఓంకార్ కే ఇవ్వాలని మరొకరు, డెలివరీ బాయ్ కావాలనే ఇదంతా చేసాడని ఇంకొకరు, ఓంకార్ కి దూల తీరిందని వేరకరు.ఇలా రకరకాలుగా అతగాడికి యేసుకుంటున్నారు.







