ఖలిస్తాన్ వేర్పాటువాద నేత హర్దీప్ సింగ్ నిజ్జర్ ( Hardeep Singh Nijjar )హత్య వెనుక భారత్ హస్తం వుందన్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో( Canadian Prime Minister Justin Trudeau ) వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.దీనిపై తమ భద్రతా సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయని ఆయన తెలిపారు.
అయితే ట్రూడో వ్యాఖ్యలపై భారత ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.వాటిని ఖండించడంతో పాటు భారత్‌లో కెనడియన్ సీనియర్ దౌత్యవేత్తను బహిష్కరించింది.
మరోవైపు.నిజ్జర్ హత్య వెనుక భారత్ హస్తం వుందని తొలి నుంచి వాదిస్తున్న ఖలిస్తాన్ గ్రూపులు( Khalistan groups ), ఇతర సిక్కు సంఘాల వాదనకు కెనడా ప్రధాని వ్యాఖ్యలు బలం చేకూర్చినట్లయ్యింది.
దీంతో సిక్కు గ్రూపులు ఆందోళనకు సిద్ధమవుతున్నట్లుగా నిఘా సంస్థలు హెచ్చరించాయి.ఖలిస్తాన్ వేర్పాటువాద సంస్థ ‘‘సిక్స్ ఫర్ జస్టిస్’’ ( Six for Justice )(ఎస్‌ఎఫ్‌జే).నిజ్జర్ హత్యకు ప్రతీకారంగా వచ్చేవారం కెనడాలోని భారత కాన్సులేట్ కార్యాలయాలను మూసివేస్తామని బెదిరించింది.

గ్లోబల్ న్యూస్ నివేదిక ప్రకారం.వచ్చే వారం ఒట్టావా, టొరంటా, వాంకోవర్‌లలోని( Ottawa, Toronto, Vancouver ) భారత కాన్సులేట్‌ల వెలుపల నిరసనలు జరగనున్నాయి.భారతీయ కాన్సులేట్‌లు ఇక్కడ పనిచేయడానికి తాము అనుమతించబోమని సిక్కుల న్యాయవాది, ఎస్‌ఎఫ్‌జే నేత గురుపత్వంత్ సింగ్ పన్నూ హెచ్చరించాడు.
నిజ్జర్‌ను హతమార్చడానికి ఆదేశాలు ఇచ్చిన వ్యక్తుల పేర్లను కెనడా ప్రభుత్వానికి ఇస్తామని ఆయన తెలిపారు.కెనడాలోని భారత హైకమీషనర్ సంజయ్ వర్మను బహిష్కరించాలని ఎస్ఎఫ్‌జే కోరుతోంది.

నార్త్ అమెరికన్ సిక్కు అసోసియేషన్ సభ్యురాలు హర్కిరీత్ కౌర్ ( Harkireet Kaur )మాట్లాడుతూ.గురుద్వారాలో హర్దీప్ తండ్రి లాంటివాడని అన్నారు.ట్రూడో ప్రకటనతో ప్రజలు ఉలిక్కిపడ్డారని, యావత్ దేశాన్ని ఈ వార్త కదిలించిందని కెనడాలోని వరల్డ్ సిక్కు ఆర్గనైజేషన్ బోర్డు సభ్యుడు జస్కరన్ సంధూ ఆవేదన వ్యక్తం చేశారు.అతి త్వరలో బ్రిటీష్ కొలంబియాలోని సర్రే పట్టణంలో ఎస్‌ఎఫ్‌జే మరోసారి ఖలిస్తాన్‌పై రెఫరెండం నిర్వహించనున్న నేపథ్యంలో ట్రూడో వ్యాఖ్యలు దీనిపై ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి.







