కొంతమంది ప్రవర్తన చూస్తుంటే ఒక్కోసారి వింతగా అనిపిస్తుంది.ఎందుకంటే వాళ్ళు చేసే పనులు చూస్తుంటే అందరికంటే బిన్నంగా ఉంటాయి.
ముఖ్యంగా జీవిత బాగ స్వామిని ఎంచుకునే విషయంలో ఎవరి స్టైల్ వారిది అని చెప్పాలి.పెళ్లి అనే బంధంతో ఇద్దరూ కూడా ఒక్కటి అవ్వాలంటే ఇద్దరి మనసులతో పాటు ఇరువురి ఆలోచనలు, అభిప్రాయాలూ, అభిరుచులు అన్ని కూడా ఒకేలా ఉండాలి.
అయితే కొందరు మాత్రం వివాహ విషయంలో కూడా విభిన్నంగా ఆలోచిస్తూ ఉంటారు.కొందరు మనుషులను పెళ్లి చేసుకోకుండా మూగ జీవాలను పెళ్లి చేసుకుని అందరిని ఆశ్చర్య పరుస్తారు.
మొన్నటికి మొన్న ఒక అరవై ఏళ్ళ బామ్మ ఒక ఆవును పెళ్లి చేసుకుని అందరిని ఆశ్చర్య పరిచింది.అలాగే మరికొందరు కుక్కలను, రోబోలను, బొమ్మలను ఇతర వాటిని పెళ్లి చేసుకుని వార్తల్లో నిలిచారు.
అలాగే వాళ్ళు ఇలా చేయడానికి గల కారణాలను కూడా వివరిస్తూ ఉంటారు.ఈ క్రమంలోనే ఇప్పుడు ఒక యువతి ఏకంగా ఒక చెట్టును పెళ్లి చేసుకుని అందరికి షాక్ ఇచ్చింది.
ఈ యువతీ చెట్టుని పెళ్లి చేసుకుని మూడు సంవత్సరాలు కూడా అవుతుందట.ఈ విచిత్రమైన ఘటన యూకేలో చోటు చేసుకుంది.యూకేలోని మెర్సీ సైడ్ లోని సెఫ్టన్ లో 37 ఏళ్ల కేట్ కన్నింగ్ హోమ్ అనే మహిళ నివాసం ఉంటున్నారు.ఆమె 2019లో చాలా సంవత్సరాల వయసు ఉన్న ఒక పెద్ద చెట్టును వివాహమాడింది.
ఈ వివాహానికి కేట్ కుటుంబసభ్యులు కూడా మద్దతివ్వడం విశేషం అనే చెప్పాలి.వివాహం అయ్యి మూడేళ్లు అవుతున్న గాని కేట్ ఈ విషయంలో ఎప్పుడు కూడా రెస్పాండ్ అవ్వలేదు.
కానీ ఇన్నాళ్లకు కేట్ ఇప్పుడు తన వివాహం విషయంలో రెస్పాండ్ అయ్యింది.ఇన్నాళ్లు అయినా ఇంకా తమ బంధం గట్టిగానే ఉందని కేట్ చెబుతున్నారు.
వారానికి ఐదుసార్లు ఈ చెట్టును సందర్శిస్తానని ఆమె తెలిపారు.
కాగా రిమ్రోస్ వ్యాలీ కంట్రీ పార్క్ గుండా బైపాస్ రోడ్ నిర్మించాలనే ఆలోచనకు వ్యతిరేకంగా ఆమె అప్పుడు ఆ చెట్టుని వివాహం చేసుకుంది.ఆమె ఇలా చేయడానికి స్ఫూర్తి దాయకం ఎవరంటే మెక్సికన్ మహిళలు అని చెపుతుంది.ఎందుకంటే చాలా ఏళ్ల క్రితం ల్యాండ్ క్లియరెన్స్ లో భాగంగా చట్టవిరుద్దంగా చెట్లను నరకడాన్ని వ్యతిరేకిస్తూ కొంతమంది మెక్సికన్ మహిళలు ఆ చెట్లను వివాహం చేసుకున్నారు.
వాళ్లనే కేట్ ఆదర్శంగా తీసుకుని చెట్టుని వివాహం చేసుకుంది.ప్రస్తుతం క్రిస్మస్ పండుగ మరికొన్ని రోజుల్లో రాబోతుందని ఆ పండగను ఈ చెట్టుతో కలిసి జరుపుకుంటామని చెబుతుంది.
ఇలా చెట్టుతో కలిసి క్రిస్మస్ పండగ జరుపుకోవడం ఇది మూడోసారి అని కేట్ వెల్లడిస్తున్నారు.అలాగే చెట్టుకి అతికించిన క్రిస్మస్ కార్డులపై విత్ వింటర్ విషెస్, ఫ్రమ్ మిస్టర్ అండ్ మిసెస్ ఎల్డర్ అని సంతకాలు కూడా చేసింది కేట్.
చెట్టుకు ముద్దు పెట్టి తన ప్రేమను తెలియచేసింది కేట్.