వెయ్యేళ్ళ కాలంనాటి దుర్గామాత ఆలయం ఎక్కడుందో తెలుసా?

భారతదేశం పురాతన ఆలయాలకు ఎంతో ప్రసిద్ధి.ఎన్నో పురాతన ఆలయాలు కట్టడాలు ఎక్కువగా మన భారతదేశంలో కనిపిస్తాయి.

ఈ ఆలయాలను, కట్టడాలను దర్శించటానికి ఇతర దేశాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుంటారు.

కొన్ని దేవాలయాలు శతాబ్దాల కాలంలో నిర్మించిన ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయి.అలాంటి చరిత్ర ఉన్న దేవాలయాలలో ఈ గుడి కూడా ఒకటి.

అయితే అంత పురాతన చరిత్ర కలిగిన ఆలయం ఎక్కడ ఉంది? ఆ ఆలయం ప్రాముఖ్యత ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.

బీహార్ రాష్ట్రంలోని, కైమూర్ జిల్లా, కౌర అనే ప్రాంతంలో ముండేశ్వరి అనే దుర్గామాత ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది.

ప్రపంచంలోనే అతి పురాతనమైన దేవాలయాలలో ఈ ముండేశ్వరి దేవాలయం ఒకటి.ఈ ఆలయంలో విష్ణు భగవానుడు, శివుడు కూడా కొలువై ఉన్నారు.

చరిత్ర కారుల అంచనా ప్రకారం ఈ ఆలయాన్ని మూడవ శతాబ్దంలో నిర్మించినట్లు చెబుతారు వారణాసికి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయ పరిసర ప్రాంతాలలో 625 కాలంనాటి శాసనాలు బయటపడటంతో ఈ ఆలయం యొక్క ప్రాముఖ్యత తెలుస్తోంది.

భారతదేశంలో మొట్టమొదటిగా నిర్మించినదే ఈ దుర్గామాత శక్తి ఆలయం ఈ ముండేశ్వరి ఆలయం ముండేశ్వరి అనే పర్వతం మీద ఉండటంతో ఈ ఆలయానికి ఆ పేరు వచ్చింది.

ఇక్కడ అమ్మవారు భక్తులకు వరాహి మాత గా దర్శనం కల్పిస్తారు.ఈ దేవాలయంలో అమ్మగారు పది చేతులను కలిగి ఉండి ఎద్దుపై స్వారీ చేస్తూ మహిషాసుర మర్ధిని రూపంలో భక్తులకు దర్శనమిస్తారు.

ఈ ఆలయాన్ని దర్శించుకోవడం వల్ల వారి కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం.

అంతేకాకుండా ఈ దేవాలయములో నాలుగు ముఖాలు కలిగిన శివుడు, విష్ణుభగవానుడు కూడా కొలువై ఉన్నారు.

పెద్ద ఎత్తున భక్తులు ఈ ఆలయాన్ని సందర్శించి పూజలు నిర్వహిస్తుంటారు.

21వ రోజుకు సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర