త్రిమూర్తులు ప్రతిష్టించిన వినాయకుని ఆలయం ఎక్కడ ఉందో తెలుసా?
TeluguStop.com
మన హిందూ పురాణాల ప్రకారం ఎన్నో ఆలయాలలోని విగ్రహాలు స్వయంభూగా వెలిసిన కాగా మరికొన్ని విగ్రహాలు దేవతల చేత ప్రతిష్ఠించబడిన ఉన్నట్లు పురాణాలు చెబుతున్నాయి.
ఈ క్రమంలోనే త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు స్వయంభుగా ప్రతిష్టించిన వినాయకుడి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందినది.
అయితే త్రిమూర్తులు ప్రతిష్టించిన వినాయకుడి ఆలయం ఎక్కడ ఉంది, ఆలయ విశిష్టతలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.
కర్ణాటకలోని కోలారు జిల్లా, కురుడుమలె అనే గ్రామంలో ఈ వినాయకుడి ఆలయం ఉంది.
కురుడుమలె గ్రామంలో ఉండటం వల్ల వినాయకుడిని కురుడుమలె వినాయకుడి గా ప్రసిద్ధి చెందాడు.
పురాణాల ప్రకారం చోళుల కాలంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది.ఈ ఆలయంలో వెలసిన స్వామి వారు 14 అడుగుల ఎత్తులో ఏక సాలగ్రామ శిలగా భక్తులకు దర్శనమిస్తుంది.
ఈ ఆలయంలో వెలసిన వినాయకుడు సాక్షాత్తు త్రిమూర్తుల చేత ప్రతిష్టించబడినది.త్రిపురాసుర సంహారానికి ముందు త్రిమూర్తులు ఈ గణపతి విగ్రహాన్ని ప్రతిష్టించి కార్య విఘ్నాలు తొలగిపోవాలని పూజించి, త్రిపురాసుర సంహారానికి బయలుదేరారని పురాణాలు చెబుతున్నాయి.
"""/" /
అదేవిధంగా త్రేతాయుగంలో ఈ ఆలయంలోని వినాయకుడిని సందర్శించి రాముడు లంకకు చేరుకొని విజయంతో తిరిగి వచ్చారు.
అదేవిధంగా ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు, పాండవులు ఈ ఆలయాన్ని సందర్శించారని అక్కడి శాసనాలు చెబుతున్నాయి.
ఈ ఆలయంలో వెలసిన వినాయకుడి ప్రత్యేకత ఏమిటంటే ఎవరికైతే కార్యాలు జరగకుండా నిత్యం ఆటంకం కలిగి ఉంటారో అలాంటి వారు ఈ ఆలయంలో వెలసిన స్వామివారిని దర్శించి పూజలు నిర్వహిస్తే వారికి ఏ విధమైన ఆటంకం కలగదని అక్కడి ప్రజల విశ్వాసం ఏదైనా కొత్త పని మొదలు పెట్టేటప్పుడు ఆలయాన్ని సందర్శించడం వల్ల ఆ పని నిర్విఘ్నంగా పూర్తి అవుతుంది.
అదేవిధంగా భక్తులు భక్తిశ్రద్ధలతో కోరిన కోరికలను తప్పకుండా స్వామివారు నెరవేరుస్తారని భక్తులు విశ్వసిస్తారు.
అందుకే నిత్యం వందల సంఖ్యలో భక్తులు ఈ ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకుంటారు.