దాదాపు 10 ఏళ్ల పెళ్లి ప్రయాణంలో పిల్లల గురించి ఎన్నో ప్రశ్నలు, ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న రామ్ చరణ్( Ram charan , ) దంపతులు గత ఏడాది తల్లిదండ్రులు అవుతున్నాము అని తెలిపి ప్రతి ఒక్కరిని సంతోషపరిచారు.ముఖ్యంగా మెగా అభిమానులు మాత్రం మెగా వారసుడు వస్తున్నాడు అని సంతోషంలో మునుగుతున్నారు.
అలా రామ్ చరణ్ ఉపాసన( Upasana ) ప్రెగ్నెన్సీ గురించి అనౌన్స్ చేసినప్పటి నుంచి ఇప్పటివరకు అభిమానులు ఉపాసనకు సోషల్ మీడియాలలో సలహాలు ఇస్తూనే ఉన్నారు.అయితే తాజాగా ఉపాసన జాతకంలో దోషం ఉందని తెలియడంతో బాగా ఆందోళనల చెందుతున్నారు అభిమానులు.
మరి ఆ దోషం ఏంటి.అసలేం జరగబోతుందో అన్న విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా వారసుడు రామ్ చరణ్ హీరోగా అడుగుపెట్టి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ఇక ఆర్ఆర్ఆర్ సినిమాతో( RRR ) గ్లోబల్ స్టార్ గా కూడా మారాడు.ఇక ఈయన పదేళ్ల కిందట ఉపాసన కామినేనిని ప్రేమ వివాహం చేసుకున్నాడు.ఇక పెళ్లి తర్వాత ఈ దంపతులిద్దరూ చాలా అన్యోన్యంగా ఉన్నారు.ఇప్పటివరకు వీరి మధ్య ఎటువంటి విభేదాలు రాలేదు.
ఉపాసన కూడా మెగావారికి తగ్గట్టుగా దొరికింది.
ఆమెలో కూడా సహాయం చేసే గుణం చాలా ఉంది.ఇక ఈమె కూడా తెలుగు ప్రేక్షకులతో మంచి అభిమానం ఏర్పరచుకుంది.
అయితే ఈ పదేళ్లలో వీరికి పిల్లల గురించి చాలా ప్రశ్నలు ఎదురయ్యాయి.ఎప్పటికప్పుడు వీటికి ప్రశ్నలను ఖండిస్తూనే వచ్చారు ఈ దంపతులిద్దరూ.
మొత్తానికి గత ఏడాది తాము తల్లిదండ్రులు కాబోతున్నాము అని శుభవార్త చెప్పారు.

ఉపాసన సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుందన్న సంగతి అందరికీ.తన ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పటి నుంచి కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గానే కనిపిస్తుంది.తన ఫోటోలను కూడా బాగా పంచుకుంటుంది.
తను తీసుకునే ఫుడ్ గురించి కూడా సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంది.తన అభిమానులు కూడా తనకు జాగ్రత్తగా ఉండమని సలహాలు ఇస్తున్నారు.

మెగా అభిమానులు మాత్రం వారసుడు కోసం బాగా ఎదురు చేస్తున్నారు.అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా ఒక వార్త బాగా వైరల్ అవుతుంది.అదేంటంటే ఉపాసన జాతకంలో దోషం ఉందని తెలిసింది.ఏంటంటే ఆమెకు బాబు పుడితే కలిసి వస్తుందని.పాప పుడితే కలిసి రాదు అని బాగా వార్త ప్రచారం అవుతుంది.

అంటే ఉపాసన జాతక ప్రకారం.ఆమెకు పాప పుడితే ఉపాసన క్రేజ్, ఫేమ్ అని విమర్శల పాలయ్యే ఛాన్సెస్ ఉన్నాయని.అదే మగ బిడ్డ పుడితే మెగా ఫ్యామిలీకి మించిన రేంజ్ లో నెంబర్ వన్ స్టార్ సెలెబ్రెటీగా పేరు సంపాదించుకుంటాడు అని వార్త వినిపిస్తుంది.
ఇక ఈ విషయం తెలిసిన మెగా అభిమానులు చాలా భయపడుతున్నారు.మరి కొంతమంది ఇవన్నీ కేవలం పుకార్లే అంటూ కొట్టి పారేస్తున్నారు.ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వార్త బాగా వైరల్ అవుతుంది.







