సంక్రాంతి స్పెషల్ సున్నుండలు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలిస్తే రోజు తింటారు!

2024 లో సంక్రాంతి పండుగ రానే వచ్చింది.సంక్రాంతి( Sankranti ) అంటే అందరికీ మొదట గుర్తుకు వచ్చేది పిండి వంటలు.

 Health Benefits Of Sankranti Special Sweet Sunnundalu! Sankranti, Sweet, Sunnund-TeluguStop.com

సంక్రాంతి వస్తోందంటే చాలా రకాల ట్రెడిషనల్ వంటకాలను తయారు చేస్తుంటారు.ఈ జాబితాలో మినప సున్నుండలు కూడా ఒకటి.

ఈ తాత ముత్తాతల నాటి వంటకం మన ఇండియాలో చాలా ఫేమస్.అందులోనూ తెలుగు రాష్ట్రాల్లో పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టంగా తినే స్వీట్స్ లో సున్నుండ ఖచ్చితంగా ఉంటుంది.

సున్నుండలు తయారు చేయడానికి కావాల్సిందల్లా మినుములు, బెల్లం మ‌రియు నెయ్యి.ఈ మూడు పదార్థాలు ఉంటే చాలు రుచికరమైన సున్నుండలు తయారైపోతాయి.రుచిలోనే కాదు సున్నుండల్లో బోలెడన్ని పోషకాలు కూడా నిండి ఉంటాయి.ఐరన్, మెగ్నీషియం, క్యాల్షియం, పొటాషియం( Iron, magnesium, calcium, potassium ), వంటి మిన‌ర‌ల్స్ తో పాటు ప్రోటీన్, ఫైబర్ మరియు అనేక రకాల విటమిన్స్ సున్నుండల్లో ఉంటాయి.

సున్నుండ( sunnundalu ) ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు తెలిస్తూ రోజు తినేస్తారు.

Telugu Tips, Latest, Sankranti, Sunnundalu, Sweet-Telugu Health

రోజుకు ఒక సున్నుండ తింటే ఆరోగ్యానికి కొండంత అండగా ఉంటుంది.రెగ్యులర్ డైట్ లో మినప సున్నుండలను చేర్చుకోవడం వల్ల ఎముకల్లో సాంద్రత పెరుగుతుంది.వయసు పైబడిన సరే మోకాళ్ళ నొప్పులు దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.

అలాగే సున్నుండల్లో ఉండే ఐరన్ కంటెంట్ రక్తహీనత( anemia ) బారిన పడకుండా రక్షిస్తుంది.బరువు తగ్గాలనుకునేవారు రోజుకు ఒక సున్నుండను తీసుకోవచ్చు.

Telugu Tips, Latest, Sankranti, Sunnundalu, Sweet-Telugu Health

సున్నుండ అతి ఆకలిని దూరం చేస్తుంది.అదే సమయంలో మెటబాలిజం రేటును పెంచి శరీరంలో కేలరీలను త్వరగా కరిగేలా ప్రోత్సహిస్తుంది.సున్నుండల్లో ప్రోటీన్ కూడా పుష్కలంగా ఉంటుంది.అందువల్ల వీటిని తీసుకుంటే నీరసం, అలసట వంటివి ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి.అంతేకాదండోయ్ సున్నుండ రక్తపోటును అదుపులో ఉంచుతుంది.జుట్టు ఎదుగుదలను సైతం ప్రోత్సహిస్తుంది.

కాబట్టి సంక్రాంతి స్పెషల్ వంటకమైన సున్నుండలను తప్పకుండా మీ డైట్ లో చేర్చుకోండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube