కన్నడ సీరియల్ నటి సౌజన్య గత నెల సెప్టెంబర్ లొ బెంగళూరు సమీపంలోని అపార్ట్ మెంట్ లో ఆత్మహత్య చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే.సౌజన్య ఉరివేసుకుని చనిపోయినట్టుగా పోలీసులు గుర్తించారు.
ఇక ఈమె కన్నడలొ బుల్లితెరపై పలు సీరియల్స్ తో పాటుగా సినిమాలలో కూడా నటించింది.ఇక ఈమె ఆత్మహత్య చేసుకున్న తర్వాత పక్కన నాలుగు పేజీల సూసైడ్ నోట్ కూడా దొరికింది.
ఇక ఆ సూసైడ్ నోట్ ఇంగ్లీషు మరియు కన్నడ భాషలలో రాసినట్లు పోలీసులు తెలిపారు.ఆ సూసైడ్ నోట్ లొ నటి సౌజన్య తన ఆత్మహత్యకు గల కారణం ఎవరు అనేది వెల్లడించింది.
ఆమె తన ఆరోగ్యం క్షీణించడం వల్ల, అలాగే పరిశ్రమలో అవకాశాలు సరిగా రాకపోవడంతో ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు వెల్లడించింది.ఈ డిప్రెషన్ కారణంగా తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు తెలుపుతు తన తల్లిదండ్రులను క్షమాపణలు కోరింది.
ఇక ఇది ఇలా ఉంటే తాజాగా నటి సౌజన్యది ఆత్మహత్యగా వైద్యులు నివేదికలో వెల్లడయ్యింది.ఈమె ఆత్మహత్య తర్వాత ఆమె తండ్రి తన కుమార్తెను హత్య చేశారని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, పోలీసులు సౌజన్య స్నేహితుడు వివేక్ విచారించారు.ఇక పోస్టుమార్టం నివేదికలో ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు తేలడంతో పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టారు.