TCL మధ్యతరగతి కుటుంబాలను దృష్టిలో ఉంచుకొని 15 వేల బడ్జెట్ లోనే మూడు కొత్త టీవీలను భారతీయ స్మార్ట్ టీవీ మార్కెట్లో ఇటీవలే విడుదల చేసింది.TCL S5400, TCL S5400A,TCL S5403A అనే పేర్లతో మార్కెట్లో విడుదల అయ్యాయి.
ఇక ఈ స్మార్ట్ టీవీలలో 4కె రిజల్యూషన్, క్వాంటం డాట్ మ్యాట్రిక్స్ టెక్నాలజీ తోపాటు బెజెల్ లెస్ డిజైన్ కలిగి ఉండి డాల్బి ఆడియో సపోర్ట్ తో 24w స్పీకర్లు ఉంటాయి.
ఈ స్మార్ట్ టీవీలో ప్రత్యేకత ఏమిటంటే గేమ్స్ ఆడేందుకు అనుకూలంగా ఉంటాయి.
ఇందులో ప్రత్యేకంగా ఆండ్రాయిడ్ టీవీ ఇంటర్ఫేస్ ఉంటుంది.ఈ స్మార్ట్ టీవీలలో సంగీతంతో పాటు ఇతర యాప్స్ కూడా వాడవచ్చు.
ఇన్ ఫీల్డ్ క్రోమ్ కాస్ట్ ఫీచర్ కూడా ఈ స్మార్ట్ టీవీలో ఉంటుంది.

TCL S5400A ,TCL S5403A డిజైన్ల విషయానికి వస్తే 32 అంగుళాలు తో కూడిన డిస్ప్లే ను కలిగి ఉంటాయి.7వేల యాప్లను పొందే ఆప్షన్ ఉండడం వల్ల 7 లక్షల కంటే ఎక్కువ సినిమాలు మరియు షోలను పొందవచ్చు.TCL S5400 టీవీ కూడా 32 అంగుళాల ఫుల్ డిస్ప్లేను కలిగి ఉండడంతో పాటు డిస్ప్లే HDR 10ని సపోర్ట్ చేస్తుంది.
ఇందులో స్మార్ట్ టీవీల కోసం సెట్ చేసిన యాప్స్ అన్ని యాక్సెస్ చేసుకోవచ్చు.చిన్నపిల్లలకు ఉపయోగపడే గూగుల్ కిడ్స్ మొడ్ ను ఇందులో యాక్సెస్ చేసుకోవచ్చు.కానీ ఇది కేవలం ఫిల్టర్ చేసిన కంటెంట్ మాత్రమే యాక్సెస్ చేసుకుంటుంది.

ఇక భారతీయ మార్కెట్లో TCL S5400 టీవీ ధర రూ.15999.TCL S5400A టీవీ ధర రూ.13490.TCL S5403A టీవీ ధర రూ.13990 గా ఉంది.అంతేకాకుండా TCL S5400,TCL S5403A టీవీలపై కస్టమర్లకు 10% క్యాష్ బ్యాక్ దొరకనుంది.
ఇక ఈ స్మార్ట్ టీవీలు ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ లలో అందుబాటులో ఉన్నాయి.







