సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లక్ష్మి కళ్యాణం సినిమా ద్వారా ఇండస్ట్రీకి హీరోయిన్గా అడుగుపెట్టిన కాజల్ అగర్వాల్ ఆ సినిమా ద్వారా మంచి గుర్తింపు పొందింది.
ఆ తర్వాత తెలుగు, తమిళ్ భాషలలో స్టార్ హీరోలు సరసన నటించే అవకాశాలు అందుకొని అతి తక్కువ కాలంలోనే హీరోయిన్ గా మంచి గుర్తింపు పొందింది.ఈ క్రమంలో బాలీవుడ్ సినిమాలలో నటించే అవకాశాలు కూడా అందుకుంది.
చాలా కాలం పాటు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న కాజల్ 2020 లో వివాహం చేసుకుని సినిమాలకు దూరం అయింది.

గౌతమ్ కిచ్లు అనే వ్యాపారవేత్తను వివాహం చేసుకున్న తర్వాత కూడా కాజల్ సినిమాలలో నటించింది.అయితే వివాహం జరిగిన కొన్ని నెలలకే గర్భం దాల్చడంతో సినిమాలకు దూరం అయింది.ఆ తర్వాత పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చి కొడుకు నీల్ కిచ్లు కోసం తన పూర్తి సమయాన్ని కేటాయించి.
ఇలా తన కుమారుడి ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది.నిన్న వాలెంటైన్స్ డే సందర్భంగా.మరో క్యూటెస్ట్ ఫొటోను షేర్ చేసి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.వాలెంటైన్స్ డే రోజున భర్తతో కలిసి ఉన్న ఓ రొమాంటిక్ ఫోటో కూడా షేర్ చేసింది.
అలాగే తన కొడుకు ప్రేమను కూడా అభిమానులతో పంచుకుంది.ఈ మేరకు ‘ఎప్పటికీ సూర్యుడిలా వెలిగిపోతూనే ఉండే వాడు, నా కొడుకు నీల్ కిచ్లు నాకు చాలా విలువైనవాడు.
అయితే వాలెంటైన్‌లు ఇంకా ముగియలేదు.నీల్ కిచ్లూ నాకు ప్రేమ తాలుకా అర్ధాన్ని ప్రతిరోజూ బోధిస్తూనే ఉన్నాడు” అంటూ కొడుకు గురించి గొప్పగా చెప్పింది.

కాజల్ అగర్వాల్ షేర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇదిలా ఉండగా బిడ్డ పుట్టిన తర్వాత ఇటీవల కాజల్ తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించడానికి సిద్ధమయ్యింది.చివరగా చిరంజీవి నటించిన ఆచార్య సినిమాలో నటించింది.ఇక ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న ఇండియన్ 2 సినిమాలో నటిస్తోంది.సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లకు వివాహం జరిగి పిల్లలు పుట్టిన తర్వాత వారికి హీరోయిన్గా అవకాశాలు రావడం చాలా అరదు.అయితే కాజల్ ఈ రూల్స్ బ్రేక్ చేసి మునుపటిలా సినిమాలలో హీరోయిన్ గా అవకాశాలు అందుకుంటుందో లేదో చూడాలి మరి.







