ఈ బిజీ లైఫ్ వల్ల చాలామంది ఉదయం పూట బయటికి రావడమే మానేశారు.అయితే శరీరానికి విటమిన్ డి అందాలంటే సూర్యరష్మి చాలా అవసరం ఉంటుంది.
సూర్య రష్మీ కావాలంటే కచ్చితంగా బయటికి రావాల్సి ఉంటుంది.కానీ చాలామంది ఎక్కువ సమయం ఇంట్లోనే ఉండి వర్క్ ఫ్రమ్ హోమ్ అని కంప్యూటర్ ముందే గడుపుతున్నారు.
దీనివల్ల ఆరోగ్యకరమైన జీవనశైలికి దూరం అయిపోతున్నారు.అయితే శరీరానికి అవసరమైన సూర్యరష్మిని కోల్పోతున్నారు.దీనివల్ల అనేక వ్యాధుల బారిన పడుతున్నారు.అయితే అనేక వ్యాధులను నివారించడానికి ప్రతిరోజు మన శరీరానికి తగినంత సూర్యరష్మీ చాలా అవసరం.
ఆహార పదార్థాల ద్వారా పొందే విటమిన్ డి కన్నా సూర్యరష్మి వల్ల వచ్చే సహజ కాంతి ద్వారా విటమిన్ డి ని ఎక్కువగా పొందవచ్చు.
ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
అదేవిధంగా శరీరానికి ఎనర్జీని అందించే హార్మోన్లను కూడా విడుదల ఎలా చేస్తుంది.అయితే ముఖ్యంగా ఈ చలికాలంలో వైరస్లు, ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వ్యాపించే అవకాశం ఉంటుంది.
కాబట్టి రోగనిరోధక శక్తి పెంచుకోవడం చాలా అవసరం.అందుకే విటమిన్ సి, విటమిన్ డి పుష్కలంగా ఉండేలా చూసుకోవాలి.
అయితే సూర్యరష్మీ వాళ్ళ కలిగే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఇప్పుడు తెలుసుకుందాం.
సూర్యరష్మి తగలడం వల్ల ఎముకలు బలంగా ఉంటాయి.
అలాగే కాల్షియం స్థాయిని పెరుగుతుంది.అదేవిధంగా సూర్యరష్మి ఇన్ఫ్లమేషన్ ను కూడా తగ్గిస్తుంది.
అదే విధంగా సూర్యరష్మి తగలడం వల్ల గ్లూకోజ్ మెటబాలిజం కి సహకరిస్తుంది.అదేవిధంగా సూర్యరష్మి తగిలితే చాలామందికి మార్నింగ్ సిక్ నెస్ దూరం అయిపోతుంది.
ఇక ఒళ్ళు నొప్పుల నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు.

అదేవిధంగా విశ్రాంతిని ప్రోత్సహిస్తుంది.సూర్యరష్మి డిప్రెషన్ నుండి బయటకు వచ్చేలా సహాయపడుతుంది.అలాగే బోలు ఎముకల వ్యాధి, రొమ్ము క్యాన్సర్, మస్కులర్ లాంటి ప్రమాదకరమైన రోగాల బారిన పడకుండా రక్షిస్తుంది.
అందుకే ప్రతిరోజు 25 నిమిషాల నుండి 30 నిమిషాల వరకు సూర్యరశ్మి శరీరానికి తగిలేలా చూసుకోవాలి.