ఏనుగులు చాలా ప్రశాంతంగా కనిపిస్తాయి.అయితే కోపం వస్తే వాటిని కంట్రోల్ చేయడం చాలా కష్టం.
తమ ముందు అడివికి రాజు అయిన సింహం ఉన్నా అవి ఏ మాత్రం భయపడవు.అవసరమైతే సింహాలపైనా దాడి చేసి వాటిని పరుగులు పెట్టిస్తాయి.
ముఖ్యంగా వాటికి ఉన్న బలంతో చెట్లను వేర్లతో సహా పెకిలించి వేస్తాయి.జనావాసాల్లోకి వచ్చే మదగజాల పట్ల చాలా మంది భయపడుతుంటారు.
నియంత్రణ కోల్పోయిన ఏనుగులు తీరని నష్టం చేస్తాయి.పంట పొలాల్లోనూ ఆహారం కోసం వచ్చి రచ్చ చేస్తుంటాయి.
ఒక్కోసారి మనుషులు సైతం ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది.ఈ తరహా ఘటనలు మన తెలుగు రాష్ట్రాల్లోనూ జరుగుతుంటాయి.
అయితే రెండు ఏనుగులకు కోపం వచ్చి, వాటికవే పోట్లాడుకున్న వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
భారీ కాయంతో ఏనుగులు( Elephants ) చాలా నెమ్మదిగా నడిచి వెళ్తుంటాయి.
అసాధారణ సందర్భాల్లో మాత్రమే పరుగులు పెడుతుంటాయి.ముఖ్యంగా అవి గుంపులుగా జీవిస్తుంటాయి.
అలాంటి రెండు ఏనుగులకు ఫైట్ జరిగింది.దక్షిణాఫ్రికా( South Africa )లోని క్రూగర్ నేషనల్ పార్క్‌లో ఈ ఘటన జరిగింది.
దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.రెండు పెద్ద ఏనుగులు ఒకదానితో ఒకటి ఘర్షణ పడడం వీడియోలో చూడొచ్చు.

రెండు ఏనుగులు కూడా భయంకరంగా ఒకదానిపై మరొకటి దాడి చేసుకుంటాయి.ముఖ్యంగా చెట్లను వేర్లతో సహా పెకిలించి, ఘర్షణ పడ్డాయి.ఏనుగుల ధాటికి చెట్లన్నీ నేలకూలాయి.అయితే వాటిలో ఏ ఏనుగు గెలిచిందో స్పష్టత లేదు.అవి ఏ మాత్రం శాంతించకుండా చాలా సేపు పోట్లాడుకున్నాయి.ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
అలాంటి సమయంలో వాటి దగ్గరకు పోకుండా ఉండడమే మంచిదని పేర్కొంటున్నారు.







