తెలంగాణ గవర్నర్ తమిళిసైపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు.గవర్నర్ కు రాజకీయాలు ఆపాదించడం సరికాదని పేర్కొన్నారు.
ప్రభుత్వం ఏ ఫైలు పంపినా ముద్ర వేస్తే గవర్నర్ తమిళిసై మంచిదని అంటారని బండి సంజయ్ తెలిపారు.కానీ తప్పు అంటే మాత్రం గవర్నర్ కు రాజకీయాలు ఆపాదిస్తారని మండిపడ్డారు.
బీఆర్ఎస్ గవర్నర్ రబ్బర్ స్టాంప్ గా ఉండాలని కోరుకుంటుందని విమర్శించారు.అయితే గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా బీఆర్ఎస్ ప్రభుత్వం పంపిన ఇద్దరి పేర్లను గవర్నర్ తమిళిసై తిరస్కరించిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే గవర్నర్ ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా, బీజేపీకి అనుకూలంగా ప్రవర్తిస్తున్నారని కవిత తీవ్ర ఆరోపణలు చేశారు.







