హర్యాన గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది అలయ్ బలయ్ కార్యక్రమం జరుగుతున్న సంగతి తెలిసిందే.గత ఏడాది ఈ కార్యక్రమానికి మంచు విష్ణు తో పాటు పవన్ కళ్యాణ్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
అయితే ఈసారి కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవిని ఆహ్వానించారు బండారు దత్తాత్రేయ ఆయన కుమార్తె “అలయ్ బలయ్” ఫౌండేషన్ చైర్మన్ విజయలక్ష్మి.
ఈ సందర్భంగా చిరంజీవిని సన్మానించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా చిరంజీవి మీడియాతో మాట్లాడుతూ స్వయంగా ఇంటికి వచ్చి “అలయ్ బలయ్” కార్యక్రమానికి పండగ పూట తనని ఆహ్వానించడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు.ఖచ్చితంగా ఈ కార్యక్రమానికి హాజరవుతానని .ఆశీస్సులు తీసుకుంటానని చిరంజీవి స్పష్టం చేశారు. అంతేకాదు “గాడ్ ఫాదర్” విజయం పట్ల కూడా చిరంజీవి మీడియా సముఖంగా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసి సంతోషం వ్యక్తం చేశారు.