మచ్చలేని మెరిసే ముఖ చర్మం కావాలని అందరూ కోరుకుంటారు.అందుకోసం ఖరీదైన ఫేస్ క్రీములు, సీరంలను వాడుతుంటారు.
తరచూ ఫేస్ ప్యాక్ లు, మాస్కులు వేసుకుంటారు.ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో చేస్తూ చర్మం కోసం వేలకు వేలు ఖర్చు పెడుతుంటారు.
కానీ ఇంట్లోనే రైస్ తో ఇప్పుడు చేప పోయే విధంగా ఫేస్ క్రీమ్ తయారు చేసుకుని వాడితే పైసా ఖర్చు లేకుండా మచ్చలేని మెరిసే ముఖ చర్మాన్ని తమ సొంతం చేసుకోవచ్చు.మరి ఇంకెందుకు ఆలస్యం రైస్ తో ఫేస్ క్రీమ్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఓ లుక్కేయండి.
ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో చిన్న కప్పు వైట్ రైస్ వేసుకుని వాటర్ తో రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలి.ఆ తర్వాత అందులో గ్లాస్ వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.
మరొసటి రోజు ఉదయాన్నే మిక్సీ జార్ లో నానబెట్టుకున్న బియ్యాన్ని వేసి కొద్దిగా వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి పల్చటి వస్త్రం సహాయంతో రైస్ జ్యూస్ ను సపరేట్ చేసి పెట్టుకోవాలి.
మరోవైపు ఒక కప్పు కొబ్బరి ముక్కలను మిక్సీ జార్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేసి కొబ్బరి పాలను తయారు చేసుకోవాలి.ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక కప్పు కొబ్బరి పాలు, అర కప్పు రైస్ జ్యూస్ వేసుకొని గరిట తిప్పుకుంటూ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి.
క్రీమీ స్ట్రక్చర్ వచ్చిన అనంతరం స్టవ్ ఆఫ్ చేసి ఉడికించుకున్న మిశ్రమాన్ని చల్లార పెట్టుకోవాలి.పూర్తిగా చల్లారిన అనంతరం అందులో రెండు చుక్కలు రోజ్ ఎసెన్షియల్ ఆయిల్, హాఫ్ టేబుల్ స్పూన్ విటమిన్ ఇ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే రైస్ క్రీమ్ సిద్ధమైనట్లే.
ఈ క్రీమ్ ను ఒక బాక్స్ లో నింపుకొని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోవాలి.నైట్ నిద్రించే ముందు ముఖానికి రైస్ క్రీమ్ ను అప్లై చేసుకుని పడుకోవాలి.ఇలా ప్రతిరోజు ఈ రైస్ క్రీమ్‌ను వాడితే కనుక ఎలాంటి మచ్చలైన దూరమై ముఖ చర్మం తెల్లగా మరియు కాంతివంతంగా మారుతుంది.