టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ తాజాగా కార్తికేయ 2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మనకు.దర్శకుడు చందు మొండేటి దర్శకత్వంలో తెరికెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది.
ఈ సినిమా కేవలం సౌత్ ఇండస్ట్రీలోనే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా కోట్ల కలెక్షన్లను కొల్లగొడుతుంది.ఇలా ఈ సినిమా ఒక చిన్న సినిమాగా విడుదలై, నేడు బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించడంతో ప్రతి ఒక్కరూ ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమా విజయం గురించి పలువురు సినీ ప్రముఖులు మాట్లాడుతూ ఈ సినిమాని ఆకాశానికి ఎత్తుతూ పెద్ద ఎత్తున చిత్ర బృందం పై ప్రశంసలు కురిపిస్తున్నారు.తాజాగా ఈ సినిమా గురించి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడుతూ కామెంట్ చేయడం ప్రస్తుతం వైరల్ గా మారింది.
ఓ కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ నిఖిల్ అనే ఒక హీరో కార్తికేయ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ సినిమా దేశవ్యాప్తంగా దుమ్ము దులుపుతోంది మార్పు అంటే ఇదే, ఇలాంటి మార్పే రావాలని కోరుకున్నాను అంటూ పవన్ కళ్యాణ్ కార్తికేయ సినిమా గురించి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.పవన్ కళ్యాణ్ మాట్లాడిన ఈ మాటలకు సంబంధించిన వీడియోని నిఖిల్ తన ట్విట్టర్ ద్వారా షేర్ చేస్తూ పవర్ స్టార్ కు కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన నోటి నుంచి ఇలా నా సినిమాని నా గురించి వినడం చాలా సంతోషంగా ఉంది అంటూ ఈ వీడియోని షేర్ చేయడమే కాకుండా పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలియజేస్తూ సంతోషంగా వ్యక్తం చేశారు.ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది.







