గత కొద్ది నెలలుగా తెలంగాణ రాజకీయాల్లో హడావుడి చేస్తున్నారు ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్.మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పోటీకి దిగి ఓటమి చెందినా ఎక్కడా తగ్గేదే లేదు అన్నట్లుగా సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు.2023 తెలంగాణ ఎన్నికల్లో తమ పార్టీ తరఫున అన్ని స్థానాల్లోనూ అభ్యర్థులను నిలబెడతామంటూ చెబుతూనే, బిజెపి ,కాంగ్రెస్, టిఆర్ఎస్ ఇలా అన్ని పార్టీలను టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తున్నారు .ఈ క్రమంలోనే తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేయాలని పాల్ డిసైడ్ అయిపోయారు .ఈ మేరకు డిసెంబర్ 7 నుంచి పాదయాత్రను ప్రారంభించబోతున్నట్లు ఆయన ప్రకటించారు.దీనికి సంబంధించిన పూర్తి షెడ్యూల్ త్వరలోనే ఆయన ప్రకటించనున్నట్లు తెలిపారు.
తమ పార్టీ సత్తా ఏమిటో మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రజలు చూశారని , ఆ ఎన్నికల్లో ఈవీఎంలు మార్చే స్థితికి టిఆర్ఎస్ బిజెపిలు దిగజారాయని పాల్ విమర్శించారు .ఈవీఎం లను మార్చి గుజరాత్ ఎన్నికల్లో బిజెపి నాలుగోసారి గెలవబోతోందని అన్నారు.అసలు మనకు ఈవీఎంలు వద్దని, అమెరికా మాదిరిగానే బ్యాలెట్ పేపర్లు కావాలని డిమాండ్ చేస్తున్నారు.డిసెంబర్ 13న ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన రాజకీయ నాయకులు, కుల సంఘాలు, విద్యార్థి సంఘాలతో తాను ప్రత్యేకంగా సమావేశం అవుతానని ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా ప్రజలకు పిలుపునిచ్చారు.తెలంగాణ బిడ్డలారా అవినీతిపరులను మీరు నమ్ముతారా .ఢిల్లీ, పంజాబ్ ప్రజల్లాగా మార్పు కోరుకుంటారా అంటూ ప్రశ్నించారు.తాను వారం రోజులు అమెరికాకు వెళ్లి వచ్చేసరికి రాష్ట్రం రావణ కాష్టంగా మారిందని ఈడి రైడ్స్ ద్వారా టిఆర్ఎస్ నాయకులు దగ్గర వేల కోట్ల రూపాయలు పట్టుబడడం , వందల కోట్ల రూపాయలతో బిజెపి వారు ఎమ్మెల్యేలను కొనడం కూడా చూస్తున్నామని ఆయన విమర్శించారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ ఐదు లక్షల కోట్లు అప్పులు చేశారని విమర్శించారు .ప్రపంచ దేశాలు భారతకు అప్పులు ఇవ్వడానికి కూడా సిద్ధంగా లేవని అన్నారు ఇక వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల అంశాన్ని ఆయన ప్రస్తావించారు .తన అన్న జగన్ నాలుగేళ్లలో రాజన్న రాజ్యం తీసుకురాలేదని , రాక్షస రాజ్యం అవినీతి రాజ్యం తీసుకొచ్చారని విమర్శించారు.జగన్ ఏపీకి స్పెషల్ స్టేటస్ తీసుకురాలేకపోయారని, తనను గెలిపిస్తే సత్తా ఏమిటో చూపిస్తాను అంటూ ఆయన వ్యాఖ్యానించారు.