సోషల్ మీడియా చాలా మందికి వినోదంగా మారుతోంది.అదే సమయంలో సోషల్ మీడియాను తమకు ఆదాయ వనరుగా యువత వినియోగించుకుంటోంది.
వయసుతో సంబంధం లేకుండా వృద్ధులు కూడా సోషల్ మీడియాలో సెలబ్రెటీలుగా మారుతున్నారు.తద్వారా ఆయా యాప్‌లు, ప్లాట్‌ఫారమ్‌ల నుంచి ఆదాయం పొందుతున్నారు.
అయితే కొందరు మాత్రం నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు.నియమ నిబంధనలను తుంగలో తొక్కి, వీడియోలు చేస్తున్నారు.
అలాంటి వారికి యూట్యూబ్ షాక్ ఇచ్చింది.యూట్యూబ్ తన ప్లాట్‌ఫారమ్ నుండి 17 లక్షలకు పైగా భారతీయ వీడియోలను తొలగించింది.
ఈ వీడియోలు యూట్యూబ్ మార్గదర్శకాలను ఉల్లంఘిస్తున్నాయని కంపెనీ పేర్కొంది.అలాగే, ప్లాట్‌ఫారమ్ నుండి కామెంట్లు కూడా తొలగించబడ్డాయి.

కరోనా వైరస్ గురించి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న 1 మిలియన్ వీడియోలను యూట్యూబ్ ఇంతకు ముందు తన ప్లాట్‌ఫారమ్ నుండి తొలగించింది.యూట్యూబ్ మూడవ త్రైమాసిక అమలు నివేదిక ప్రకారం కంపెనీ తన ప్లాట్‌ఫారమ్ నుండి 1.7 మిలియన్ల భారతీయ వీడియోలను డిలీట్ చేసింది.ప్రపంచవ్యాప్తంగా 5.6 మిలియన్ వీడియోలను తొలగించింది.ఈ వీడియోలన్నీ కంపెనీ మార్గదర్శకాలను ఉల్లంఘిస్తున్నాయి.
నిబంధనలను ఉల్లంఘించిన 36 శాతం వీడియోలు ఒకే వ్యూస్ కూడా పొందకముందే తొలగించబడ్డాయి.అయితే ఆ వీడియోలను ఒకటి నుండి పది సార్లు వీక్షించినప్పుడు 31 శాతం వీడియోలు తొలగించబడ్డాయి.
వీడియోలతో పాటు, వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ నిబంధనలను ఉల్లంఘించినందుకు 737 మిలియన్ల వ్యాఖ్యలను కూడా తొలగించిందని యూట్యూబ్ నివేదిక తెలిపింది.







