వాహనదారులకు షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్న కేంద్రం.. !?

కేంద్ర ప్రభుత్వం గానీ, రాష్ట్ర ప్రభుత్వం గానీ ప్రజలకు ఉచిత పధకాలు అమలు చేస్తూ, వెనక నుండి అధిక ధరలు పెంచుతూ నిలువు దోపిడి చేస్తున్నా ఏ ఒక్క ఓటర్‌కు కూడా ఆలోచించడం లేదని కొందరు వాపోతున్నారట.

 The Central Government Ready To Put Green Tax For Old Vehicles,  Big Shock To Mo-TeluguStop.com

అదీగాక గత మూడు నెలలుగా సామాన్యుడు బ్రతక లేనంతగా ధరలు మండిపోతున్నాయి.

ఇలాంటి సమయంలో కేంద్రం పాత వాహనాల విషయంలో గట్టి వలయాన్నే ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తుందన సమాచారం బయటకు వస్తుంది.ఇందుకు అనుగుణంగా పాత వాహనాలపై పన్ను విధించే యోచనలో ఉన్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.

ఈమేరకు దేశంలో 15 ఏళ్ల నాటి పాత వెహికల్స్ 4 కోట్లకు పైగా ఉన్నాయని, వీటిని గ్రీన్ ట్యాక్స్ కిందకు తీసుకురావాలని కేంద్రం భావిస్తోందని సమాచారం.అయితే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు పాత వెహికల్స్‌పై గ్రీన్ ట్యాక్స్ విధింపు అంశాన్ని తెలియజేసినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.

మొత్తానికి ప్రజల నుండి పన్నులు వసూల్ చేయడమే పనిగా పెట్టుకున్న ప్రభుత్వాలు కూలిపోతే గానీ ప్రజల్లో ఉన్న ఆవేశం విలువ తెలియదని ఈ పరిస్దితులను గమనిస్తున్న వారు అనుకుంటున్నారట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube