సూర్యనారాయణ రాజు, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు.ముఖ్యమంత్రి ప్రకటించిన పిఆర్సీ ,ఇతర అంశాలు ఆమోదం కాదని ఆరోజే చెప్పాం.
కొన్ని ఉద్యోగ సంఘాల నేతలు సంక్రాంతి తరవాత అన్నిటి మీద ప్రకటన వస్తుందని ఆశ పడ్డారు.ప్రభుత్వం ఇచ్చిన జీవోల పై ముఖ్యమంత్రి నే పునఃసమీక్షించాలి.
మధ్యంతర భృతిని తిరిగి వెనక్కి తీసుకోవడం దేశ చరిత్రలో ఎక్కడ జరగలేదు.
ఎహెచ్ఆర్ ఏ విషయంలో ప్రభుత్వం మాట తప్పింది.
సీఎస్ , అధికారులు కమిటీ ముఖ్యమంత్రిని తప్పుదోవ పట్టిస్తున్నారు.ఉద్యోగులకు ఇచ్చిన వాటిని వెనక్కి తీసుకోమని ఏ ముఖ్యమంత్రి చెప్పరు.
రెంట్ ఫ్రీ ఎహెచ్ ఆర్ ఏ జి ఇస్తే.ఎహెచ్ ఆర్ ఏ మీద ఎవరు చర్చ పెట్టరు.
సెంట్రల్ పే కమిషన్ ను ఏపీ లో అమలు చేస్తామంటే ఎలా కుదురుతుంది.ఉద్యోగుల మీద ఉన్న రాష్ట్ర ప్రభుత్వ అధికారులను కేంద్ర ప్రభుత్వానికి బదలాయిస్తుందా?.ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధానం అమలులో ఉంది.
ఇల్లు అలకగానే పండగ అయిపోదు.
ఉద్యోగులతో పెట్టుకున్న నాయకులు ఎవరైనా ఇబ్బంది పడాల్సిందే.ఉద్యోగ సంఘాల నాయకులు ఆధిపత్యం వదిలి ఉమ్మడి పోరాటానికి సిద్ధం కావాలి.
ఇపుడు ప్రభుత్వానికి అవకాశం ఇస్తే…భవిష్యత్ లో చాలా నష్టపోతాం.ఈ వ్యవహారం లో అధికారులు ముఖ్యమంత్రిని తప్పుదోవ పట్టిస్తున్నారు…
చీఫ్ సెక్రెటరీ అత్యంత బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారు.
రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి పై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారా?.రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై కాగ్ ప్రశంసలు కురిపించింది.
అంటే రాజ్యాంగబద్ధ సంస్థ అబద్దాలు చెప్పిందా?.లేక రాష్ట్ర ప్రభుత్వం అబద్దాలు చెబుతుందా?
.