ఒకప్పుడు ఫోన్లను గడగడలాడించిన జోకర్ మాల్వేర్ మళ్లీ ఎంటర్ అయ్యింది.ఇదొక ప్రమాదకరమైన వైరస్ అని చెప్పొచ్చు.
జొకర్ వైరస్ మళ్లీ వచ్చినట్లుగా బెల్జియం పోలీసులు తెలిపారు.వారు ఆండ్రాయిడ్ యాప్ స్మార్ట్ ఫోన్ యూజర్లకు హెచ్చరికలు కూడా జారీ చేశారు.
వైరస్ లల్లో ఇది అత్యంత ప్రమాదకరం.జోకర్ వైరస్ ఆండ్రాయిడ్ పరికరాలపై దాడి చేస్తుంది.
గూగుల్ ప్లే స్టోర్లలో అనేక యాప్స్ ఉంటాయన్న సంగతి మనకు తెలిసిందే.అయితే ఈ వైరస్ వినియోగదారుడి పర్మిషన్ లేకుండా ఫోన్లలోకి వెళ్లిపోతుంది.
అంతేకాకుండా ఇది పేమెంట్ సర్వీసులను సబ్స్క్రైబ్ చేసేస్తుంది.ఇందులో భాగంగా గూగుల్ మొత్తం 8 ప్లేస్టోర్ అప్లికేషన్లను గుర్తించి నిషేధించింది.
వీటిల్లో అత్యంత హానికరమైన వైరస్ ఉన్నట్టుగా వారు గుర్తించారు.ఈ విషయాన్ని బెల్జియం పోలీసులు తమ పోర్టల్ లో రాశారు.

ఆ 8 యాప్ లను ఈ సంవత్సరం జూన్ నెలలో క్విక్ హీల్ సెక్యూరిటీ ల్యాబ్ పరిశోధకులు గుర్తించారు.ఇటువంటి మాల్వేర్ గురించి తెలిసిన తర్వాత గూగుల్ ఆ యాప్స్ ను ప్లే స్టోర్ నుంచి డిలీట్ చేేసేసింది.ఆండ్రాయిడ్ యూజర్లు తమ స్మార్ట్ ఫోన్ నుంచి ఈ 8 యాప్ లను డిలీట్ చేసేయాలని చెప్పింది.ఈ 8 యాప్స్ ఉన్నవారు జోకర్ మాల్వేర్ బాధితులుగా మారిపోతున్నట్లు బెల్జియం పోలీసులు హెచ్చరించారు.
ఒక్కసారి ఫోన్ వస్తే చాలు ఫోన్ లో ఉండే విలువైన సమాచారం హ్యాకర్లు కొల్లగొట్టేస్తారు.ఆ తర్వాత ఆ సమాచారాన్ని డార్క్ వెబ్ లో అమ్ముకుంటారు.ఒకవేళ అకౌంట్ లో డబ్బులుంటే అవి వెంటనే ఖాళీ అయిపోతాయంతే.జోకర్ మాల్వేర్ 2017వ సంవత్సరంలో మొదటిసారిగా గూగుల్ ప్లేస్టోర్ లో కనిపించింది.
రెప్పపాటులో ఈ వైరస్ మన అకౌంట్లో ఉన్న డబ్బులను మాయం చేసేస్తుంది.ఇక తాజాగా గూగుల్ గుర్తించిన ఆ 8 ఆండ్రాయిడ్ యాప్స్ జాబితా ఇదే Auxiliary Message, Element Scanner, Fast Magic SMS,Free Cam Scanner,Go Messages,Super Message,Super SMS ,Travel Wallpapers.