ప్రస్తుత రోజుల్లో విద్యాసంస్థల తీరు చాలా విభిన్నంగా ఉంది.విద్య ఒక వ్యాపారంలా మారిపోయి.
విద్యా సంస్థ యాజమాన్యాలు అధిక ఫీజులకు పాల్పడుతున్నారు.ప్రభుత్వం విధించిన ఫీజు కాకుండా అధిక మొత్తంలో వసూలు చేస్తున్నారు.
తాజాగా ఈ రకంగా తెలంగాణ రాష్ట్రం మీర్ పేట్ లో టీకేఆర్ పాలిటెక్నిక్ కాలేజ్( TKR Polytechnic College ) యాజమాన్యం విద్యార్థుల వద్ద అధిక ఫీజులకు పాల్పడింది.కన్వీనర్ కోట కింద ₹15,000 ఫీజు ఉండగా ₹52,000 కట్టమని యాజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రులపై ఒత్తిడి చేస్తూ ఉంది.
మీర్ పేట్ లో టీకేఆర్ పాలిటెక్నిక్ కాలేజ్ లో మొదటి సంవత్సరం జాయిన్ అవ్వడానికి.సోమవారం అడ్మిషన్లకు చివరి రోజు కావడంతో.ముందు వెనక ఆలోచించకుండా కాలేజీ యాజమాన్యం ఫీజులు వసూలు చేస్తూ ఉంది.గవర్నమెంట్ సూచించిన ఫీజు మాకు సరిపోవట్లేదు అని హైకోర్టులో( High Court ) ఫీల్ దాఖలు చేసిన ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు.
కేసు పెండింగ్ లో ఉండి తీర్పు రాకముందే అధిక ఫీజులకి పాల్పడుతున్నారు.ఈ పరిణామంతో మీర్ పేట్ లో టీకేఆర్ పాలిటెక్నిక్ కాలేజ్ ఎదుట మొదటి సంవత్సరం జాయిన్ అవ్వడానికి వచ్చిన విద్యార్థులు మరియు తల్లిదండ్రులు ఆందోళన చేస్తూ ఉన్నారు.