కరోనా వైరస్ కారణంగా ఇప్పటి వరకు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న జనాలు ఇప్పుడు ఇంటర్నెట్ కష్టాలు కూడా ఎదుర్కోబోతున్నారు.ఇండియాలో గతంలో ఎప్పుడు లేనంతగా ఇంటర్నెట్ వినియోగం పెరిగినట్లుగా టెక్ నిపుణులు చెబుతున్నారు.
కరోనా కారణంగా ఆఫీస్‌లకు సెలవులు లేదంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంకా పలు కంపెనీలు షట్ డౌన్ అవ్వడం, విద్యా సంస్థలు మూసేయడం వల్ల అందరు ఇళ్లకే పరిమితం అవుతున్నారు.వారంతా కూడా ఇప్పుడు ఇంటర్నెట్ మీద పడుతున్నారు.
ఇంటర్నెట్‌లో బ్రౌజింగ్ ఇంకా వీడియోలు చూడటం, సినిమాలు స్ట్రీమింగ్ చేయడం వంటి కారణాలతో ఇంటర్నెట్ ట్రాఫిక్ జామ్ ఏర్పడుతున్నట్లుగా సమాచారం అందుతోంది.భారత దేశంలో సరాసరిగా ఇంటర్నెట్ యూజర్స్ ప్రతి రోజు 22.5 మిలియన్‌ల మంది ఉన్నారు.వారంతా కూడా రెగ్యులర్ కంటే ఇప్పుడు అధికంగా ఇంటర్నెట్ సేవలను వినియోగిస్తున్నారు.
మూడు వారాల ముందుతో పోల్చితే ఇప్పుడు ఇంటర్నెట్ వినియోగం ఏకంగా రెండున్నర రెట్లు పెరిగినట్లుగా ఒక ఇంటర్నెట్ సంస్థ తెలియజేసింది.

మన ఇండియాలోనే కాకుండా దాదాపు అన్ని దేశాల్లో కూడా ఇంటర్నెట్ వినియోగం విపరీతంగా పెరగడంతో ఇంటర్నెట్ ట్రాఫిక్ జామ్ అవుతుంది.దక్షిణ కొరియాలో ఇంటర్నెట్ వినియోగం 40 శాతం పెరిగింది.ఇక ఇటలీలో 30 శాతం వరకు పెరిగింది.
అమెరికాలో కూడా 30 శాతం వరకు ఇంటర్నెట్ వినియోగం పెరిగినట్లుగా చెబుతున్నారు.యూరప్‌లో అత్యధికంగా 50 శాతం ఇంటర్నెట్ యూజర్స్ పెరిగినట్లుగా సమాచారం అందుతోంది.
అత్యధికులు ఇంటర్నెట్‌ను వాడుతున్న నేపథ్యంలో వీడియో స్ట్రీమింగ్ సంస్థలు తమ వీడియో క్వాలిటీని తగ్గిస్తున్నట్లుగా ప్రకటించాయి.యూట్యూబ్‌లో హై క్వాలిటీ వీడియోలు తగ్గించినట్లుగా సంస్థ ప్రకటించింది.
నెట్ ప్లిక్స్ కూడా ఈ విషయాన్ని తెలియజేసింది.మొత్తానికి కరోనా వల్ల ఇంటర్నెట్‌కు కష్టాలు వచ్చాయి.